రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేస్తోంది.
ఈ మేరకు ఐఎండీ హైదరాబాద్ అధికారులు విషయాన్ని వెల్లడించారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురియవచ్చని, 30 నుంచి 40 కిలోమీట్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందనీ ఐఎండీ తెలిపింది.
రాగల 24 గంటలపాటు హైదరాబాద్ లో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఉపరితల గాలులు దక్షిణ లేదా ఆగ్నేయ దిశలో వీచే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 6 నుంచి 10 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 39 డిగ్రీల సెల్సియస్, 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు చెప్పారు