రాహుల్ గాంధీ కి ఏది కలిసిరావడం లేదు. బ్యాడ్ టైం నడుస్తోంది. ‘రాహు’ కాలం ఇంకా వెన్నంటి నడుస్తోంది. ఒక్క అడుగు ముందుకువేస్తే నాలుగు అడుగులు వెనక్కి పడుతున్నాయి. ‘మోడీలు అందరు దొంగలు’ అన్న చిన్న మాటకు కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు కొత్తగా వీర్ సావర్కర్ మనవడు మనవడు సాత్యకి సావర్కర్ నీ తెరమీదకి వచ్చేలా చేశారు బిజెపి నాయకులు. దగ్గరుండి రాహుల్ గాంధీ మీద కోర్ట్ లో కేసు వేయించారు. ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ లండన్ లో పాల్గొన్న ఓ కార్యక్రమంలో వీర్ సావర్కర్ గురించి తప్పుగా మాట్లాడాడు అన్నది సాత్యకి సావర్కర్ ఆరోపణ. ఒక గొప్ప వ్యక్తి మీద రాహుల్ గాంధీ తెలిసి తెలియని అజ్ఘానంతో నోటికి వచ్చింది వాగాడు అని అతను ఆరోపించారు. దానికి తగిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయి అని అయన ధిమాతో చెప్పాడు. అందుకే ఆయన పూణే లోని కోర్ట్ లో పరువుదావా నస్టం వేశాడు.
ఇప్పటికి మోడీ పెరున్న బిజెపి నాయకులు రాహుల్ గాంధీ మీద సూరత్ కోర్ట్ లో పరువదవా నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. మొన్న మోడీ పేరున్న మరో వ్యక్తి కూడా పాట్న కోర్ట్ లో రాహుల్ గాంధీ మీద పరువుదావా కేసు వేశాడు. రాహుల్ ని హాజరుకావాలని పాట్న కోర్టు ఆదేశించింది.