నెహ్రూ వంశంలో ముగ్గురు ప్రధానులు. దేశ రాజకీయాలను శాసించే నాలుగు తరాల ఆధిపత్యం. నాలుగో తరానికి చెందిన రాహుల్ గాంధీ కాలం కలిసిరావడం లేదు. ఒక్క అడుగుముందుకు వేస్తుంటే, నాలుగు అడుగులు వెనక్కి పడుతున్నాయి. లలిత్ మోడీలాగా ఆయన స్కాం లు చేయలేదు. నిరవ్ మోడీ లాగా బ్యాంకు ల్లో కోట్లాది రూపాయలు దోచుకుని విదేశాలకు పారిపోలేదు. ‘మోడీ ఇంటి పేరున్న వాళ్ళు దొంగలు’ అని ఓ తప్పుడు మాట దొర్లాడు. అంతే! పచ్చిగుడ్డే పామై కరిచింది.
దానిని తప్పుపడుతూ మోడీ ఇంటిపేరును ముంచిన వాళ్ళను పట్టి పోలీసులకు పట్టించకుండా, ఆ ఒక్క పదం వాడిన పాపానికి రాహుల్ గాంధీ మీద కోర్ట్ లో కేస్ వేశారు పూర్నేష్ మోడీ. సూరత్ కోర్ట్ దానికి శిక్షగా రాహుల్ కి రెండు సంవత్సరాల సాధారణ శిక్ష విధించింది. రూ. 15,000 జరిమానా విధించింది.
రాహుల్ గాంధీని దోషిగా తేలిన 23 మార్చి 2023 నుంచి నుంచి ‘కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నఅనర్హత వర్తిస్తుంది. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8లోని ఆర్టికల్ 102(1)(e) ప్రకారం నిర్ణయం తీసుకున్నాం’’ అని పేర్కొంటూ లోక్‌సభ సెక్రటరీయేట్ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ సర్క్యూలర్ జారీ చేశారు.
సోనియా గాంధీ మొన్ననే రాజకీయ రిటైర్ మెట్న్ తీసుకున్నారు. ఇప్పుడు రాహుల్ ఎం పి సీట్ పోయింది. ఇక ప్రజలే కాంగ్రెస్ ని కాపాడుకోవాలి.