ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి మకాం మార్చనున్నారా..? దక్షిణాదిన కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తుండటంతో సౌత్ సెంటర్ గా పాలిటిక్స్ చేయనున్నారా..? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.
ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ హైదరాబాద్ కు మకాం మార్చనున్నారాని రెండు రోజులుగా వార్తలు గుప్పుకుమంటున్నాయి. అధికారంలోకి రావాలంటే దక్షిణాదిన సాధ్యమైనంత ఎక్కువగా సీట్లు గెలుచుకోవాలనేది రాహుల్ ప్లాన్. అందుకోసం సౌత్ సెంటర్ గా రాజకీయాలు చేస్తే ప్రయోజనం ఉంటుందనేది పార్టీ నేతల అభిప్రాయం కూడా. అందుకే రాహుల్ కోసం హైదరాబాద్ లో మంచి ఇంటిని సెర్చ్ చేస్తున్నారని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీకి బోయిన్ పల్లిలో 8ఎకరాల స్థలం ఉంది. అక్కడ రాహుల్ కోసం ఇంటి నిర్మాణం చేపడితే ఎలా ఉంటుంది..? అని పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. అది రాహుల్ ఉండేందుకు ఆమోదయోగ్యంగా ఉంటుందా..? లేక మరో స్థలం చూడాలా..? అనే పార్టీ నేతలు ఆలోచనలో పడ్డారు. రాహుల్ అభిప్రాయం మేరకు ముందుకు సాగాలని చూస్తున్నారు.
రాహుల్ గాంధీ హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేస్తే బాగుంటుందని.. తద్వారా తెలంగాణలో ఆ ప్రభావం ఉంటుందని పార్టీ నేతలు నమ్ముతున్నారు. పైగా.. రాహుల్ గాంధీకి ఇంటి సమస్య ఉండటంతో ఎలాగైనా తనను హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ లో సొంతిల్లు నిర్మించుకుంటే బాగుంటుందని అంటున్నారు.
టీపీసీసీ నేత ఒకరు ఇప్పటికే రాహుల్ కు సెట్ అయ్యేలా కొన్ని ఇళ్ళను సెలక్ట్ చేసి ఆయనకు పంపారని అంటున్నారు. ఆ ఇళ్ళలో ఏదో ఒకటి రాహుల్ కు నచ్చితే ఈ నెలలో హైదరాబాద్ కు మకాం మార్చుతారని చెబుతున్నారు.
Also Read : కేసీఆర్ సంచలన నిర్ణయం : 34మంది బీఆర్ఎస్ అభ్యర్థులు చేంజ్..?