కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరి చాలా మందిని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. గతానికి, ప్రస్తుతానికి మధ్య ఆయనలో స్పష్టమైన పరిణితి కనిపిస్తోంది. సమస్యలపై స్పందించే విధానం కానీ, ప్రజలతో కలిసిపోతున్న తీరు కానీ అందర్నీ ఆలోచింపజేస్తోంది. నరేంద్ర మోడీ వ్యతిరేకులకు రాహుల్ గాంధీ ఓ టార్చ్ బేరర్ లా కనిపిస్తున్నారు. గతేడాది భారత్ జోడో యాత్ర చేపట్టి 4000కి. మీ సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టిన రాహుల్.. అప్పటి నుంచి ప్రజలతో మమేకం అవుతోన్న తీరు అందర్నీ ఆకర్షిస్తోంది.
తాను ప్రధానమంత్రి అభ్యర్థి, గాంధీ, నెహ్రూల వంశీకుడి అనే గర్వం రాహుల్ లో కించిత్ కూడా కనిపించడం లేదు. సాధారణ పౌరుడిలా జనంతో కలిసిపోతున్నారు. అందరిలో ఒకడిగా ముందుకు సాగుతున్నారు. సమస్యలు చెప్పే వారి సమస్యలను సావధానంగా వింటున్నాడు. పలు అంశాలపై ప్రశ్నిస్తే స్పష్టమైన సమాధానం ఇస్తున్నాడు. జర్నలిస్టులు రాహుల్ గాంధీకి తికమక పెట్టె ప్రశ్నలను సంధించినా పూర్తి రాజకీయ పరిణితితో కూడిన ఆన్సర్ ను చేస్తూ..దేశం కోరుతున్న నాయకుడు అనే భావన ప్రజల్లో కల్గిలా వ్యవహరిస్తున్నారు రాహుల్ గాంధీ.
ఇటీవల కాలంలోరాహుల్ గాంధీ ఎత్తినన్ని అవతారాలు ఏ రాజకీయ నాయకుడు ఎత్తలేదు. ఆయన రైతు అయ్యాడు, కూలి అయ్యాడు, కార్పెంటర్ అయ్యాడు. రోజుకో చోట ప్రత్యక్షం అవుతూ ప్రజలను సర్ ఫ్రైజ్ చేస్తూ జనాల సమస్యలను వింటున్నాడు. రాహుల్ బహురూపాలు చూస్తూంటే జనాలకు ముచ్చటతో పాటు ఏదో తెలియని ఆసక్తి ఏర్పడుతోంది. దేశంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న మోడీని డీ కొట్టాలంటే రాహుల్ తన పంథాను మార్చుకోవాలని అనుకున్నారేమో. కానీ ఆయన వైఖరి మాత్రం దేశంలోని కింది, మధ్య తరగతి ప్రజలకు సరికొత్త ఆశలను రేపుతోంది. రాహుల్ వస్తే తమ జీవితాల్లో మార్పు చేసుకుంటుంది అనే భావన కల్గేలా ముందుకు సాగుతున్నారు.
ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో రైల్వే కూలీలతో కలసి బరువుని నెత్తిన పెట్టుకుని రాహుల్ రైల్వే కూలీగా మారారు. బిలాస్ పూర్ నుంచి చత్తీస్ ఘడ్ వరకూ మొత్తం 110 కి.మీ ప్రయాణం చేసి సాధారణ ప్రజలతో కలిసిపోయాడు. ఢిల్లీలోని కీర్తినగర్ లో ఓ చోట కార్పెంటర్ గా మారిపోయారు. తనది కాని పనిని తన సొంతం చేసుకుంటూ ప్రజలకు చేరువ అవుతున్నాడు. ఏడాది కాలంగా ఆయన జనంతోనే ఉంటున్నారు. జనం మధ్యలోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. రాహుల్ గాంధీ ఒకప్పటి యువరాజు కాదు నేల మీద నడయాడే సగటు మనిషి అన్న భావనను అయితే కలిగించగలిగారు.
ఇది కాంగ్రెస్ కు , రాహుల్ గాంధీకి ప్రజల్లో పాజిటివ్ ఒపినియన్ కల్గేలా చేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Also Read : రాహుల్ ను కెలుకుతారా – అసద్ టార్గెట్ గా కాంగ్రెస్..!!