ప్రధాని మోడీ నుద్దేశించి గతంలో రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యల కేసు కీలక ములుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పరువునష్టం దావాను ఎదుర్కొన్న రాహుల్ గాంధీని దోషిగా గుర్తిస్తూ సూరత్ కోర్టు తీర్పు వెలువరించింది. ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద ఈ శిక్ష విధించింది. ఈ సెక్షన్ల కింద గరిష్ఠంగా రెండేళ్ల శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
2019లో యూపీలో జరిగిన భారీ వహిరంగా సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సభలో ప్రధాని మోడీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. . దేశంలో ఉన్న దొంగలంతా మోడీ ఇంటి పేరుతోనే ఉన్నారన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన లలిత్ మోడీ, నీరవ్ మోడీలను ప్రస్తావిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై గుజరాత్ కు చెందిన మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావాను వేశారు. అప్పటి నుంచి కోర్టులో విచారణ కొనసాగుతోంది.
మోడీ ఇంటిపేరున్న తన పరువుకు నష్టం కలిగించారనే ఆరోపణలతో కోర్టును ఆశ్రయించిన పూర్ణేష్ మోడీ…రాహుల్ పై ఐపీసీ సెక్షన్ 499, 500 కింద చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు..సూరత్ కోర్టుకు ఆధారాలను సమర్పించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్ట్.. తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది.
పరువు నష్టం దావా కేసులో రాహుల్ ను దోషిగా నిర్ధారిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 15000 జరిమానా కూడా విధించింది. అయితే సూరత్ కోర్టులోనే రాహుల్ కు ఉపశమనం లభించింది. ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రాహుల్ అభ్యర్థన మేరకు న్యాయమూర్తి తాత్కాలిక బెయిల్ పొందారు. దీంతో ఊరట లభించినట్టయ్యింది.
Also Read : టీఎస్ పీస్సీ పేపర్ లీకేజీలో కేటీఆర్ విచారణ ఎదుర్కోక తప్పదా- ఉచ్చు బిగిస్తోన్న రేవంత్