తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ ఫుల్ సపోర్ట్ చేస్తోంది. ఆయన పాదయాత్ర వివరాలు అడిగి తెలుసుకున్న రాహుల్ గాంధీ ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీకి హాజరైన రేవంత్ ను పిలిచి ప్రత్యేకంగా అభినందించారు. పార్టీలో లుకలుకలను ఏమాత్రం పట్టించుకోవద్దని… అధికారమే లక్ష్యంగా సాగిపోవాలని సూచించారు.
సీఎం అభ్యర్థి విషయంలోనూ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. పార్టీని క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేస్తున్నారు. కాబట్టి టికెట్ల కేటాయింపులోనూ మీ నిర్ణయానికి పెద్దపీట వేస్తామని రాహుల్ గాంధీ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మీరు సూచించిన వ్యక్తులకే 80శాతం టికెట్లు ఇస్తామని రేవంత్ కు రాహుల్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక.. మొదటి నుంచి రేవంత్ కు అండగానున్న కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ రేవంత్ కోసం ఢిల్లీలో లాబియింగ్ చేస్తున్నట్టు సమాచారం. డీకే ఇచ్చిన సమాచారంతోనే రేవంత్ ను రాహుల్ పిలిచి భుజం తట్టారని తెలుస్తోంది. పార్టీలో అంతర్గత సమస్యలు ఉంటె తాను చూసుకుంటా..ఎన్నికల వేళ వెనకడుగు వేయకని రేవంత్ కు రాహుల్ ఫుల్ పవర్స్ ఇచ్చినట్లు సమాచారం.
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా జరిగినా ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయిస్తా. అలాగే.. ప్రియాంక గాంధీ త్వరలోనే రేవంత్ చేపట్టిన పాదయాత్రలో ఓ రోజు పాల్గొంటారని చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యమైన విషయాల కోసం ఖర్గే , ప్రియాంక గాంధీలతో టచ్ లో ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది.
ప్లీనరీలో రాహుల్ ఇచ్చిన బూస్టింగ్ తోనే పాదయాత్రలో బీఆర్ఎస్ నేతలను రేవంత్ చెడుగుడు ఆడుకుంటున్నారని అంటున్నారు. పైగా.. హైకమాండ్ పెద్దల అండదండలు రేవంత్ కు పుష్కలంగా ఉండటంతోనే సీనియర్లు ఒక్కరిద్దరు మినహా నేతలు రేవంత్ యాత్రలో భాగస్వామ్యం అవుతున్నట్టు సమాచారం.