కేంద్ర పెద్దల అండదండలు జగన్ కు ఎంతలా ఉన్నాయో మరోసారి ఏపీ ప్రజలకు క్లారిటీ వచ్చింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఇటీవల ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించిన వివరాలను బయట పెట్టింది. తాజాగా కేంద్రం మాత్రం అప్పుల విషయంలో ఏపీ సర్కార్ చెబుతున్న లెక్కలే నిజమనేలా పార్లమెంట్ లో వంత పాడింది. వివిధ కార్పోరేషన్ల ద్వారా ఏపీ ప్రభుత్వం మొత్తం రూ. పది లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారని పురందేశ్వరి చాలా స్పష్టంగా చెప్పింది, కేంద్ర మంత్రి నిర్మలా సీతరామన్ ను కలిసి ఏపీకి కొత్తగా అప్పులు తీసుకునే వెసులుబాటు ఇవ్వొద్దని చెప్పింది. కానీ పురందేశ్వరి చెప్పిన వాటిని పట్టించుకోకుండా నిర్మలా సీతారామన్ వైసీపీ నేతల లెక్కలను చెప్పటం హాట్ టాపిక్ అవుతోంది.
టీడీపీ అధికారం కోల్పోయే నాటికి అంటే 2019 మార్చి నెలాఖరు నాటికి ఏపీకి రూ.2,64,451 కోట్ల అప్పు ఉన్నది. ఆ అప్పులు ఈ ఏడాది నాటికీ రూ.4,42,442 కోట్లకు చేరాయని పార్లమెంట్‌కు నిర్మలా సీతారామన్ తెలిపారు. అంటే పెద్దగా అప్పులేమి చేయలేదనే అర్థం వచ్చేలా ఆమె వ్యాఖ్యానించింది. నిజానికి నిర్మలా సీతారామన్ చెప్పిన లెక్క కరెక్ట్ కానీ కార్పోరేషన్ల ద్వారా ఏపీ ప్రభుత్వం తీసుకున్న అప్పులను ఆమె చెప్పలేదు. వైసీపీ నేతలు కూడా కార్పోరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులను ఎక్కడ చెప్పడం లేదు. ఇప్పుడు కేంద్రం కూడా ఆ లెక్కలను బహిర్గతం చేయకుండా వైసీపీకి మేలు చేసేలా వ్యవహరించింది.
ఏపీ అప్పుల ఊబిలోకి వెళ్తుందని ఓ వైపు విమర్శలు వస్తుండగా పురందేశ్వరి పక్కా లెక్కలతో వైసీపీ సర్కార్ చేసిన అప్పుల బండారం బయటపెట్టింది. దీంతో వైసీపీని అందరూ కార్నర్ చేస్తున్నారు. వైసీపీకి కూడా ఇబ్బందికర పరిణామంగా మారింది. ఈ క్రమంలోనే ఏపీ అప్పులపై నిర్మలా సీతారామన్ చెప్పిన అరకొర సమాధానంతో వైసీపీకి మేలు జరుగుతోంది. అంతేకాదు నిర్మలమ్మ చెప్పిన లెక్కలతో పురందేశ్వరి చెప్పిన లెక్కలే తప్పు అనేలా వైసీపీకి కూడా ఓ ఆయుధం దొరికింది.
Also Read : సినిమా రంగంలోకి ఏపీ మంత్రి విడదల రజిని