పునర్నవి భూపాలం అందరికీ తెలిసిన నటి. సినిమా అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నించిన ఛాన్స్ లు రాకపోవడంతో మళ్ళీ చదువుపై ఫోకస్ పెట్టింది. ఆ మధ్య బిగ్ బాస్ హౌజ్ లో కనిపించి అభిమానుల అటెన్షన్ తనవైపు తిప్పుకుంది. హౌజ్ లో ఉన్నాన్నాళ్ళు రాహుల్ సిప్లిగంజ్ తో సన్నిహితంగా మెదిలింది. దాంతో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వచ్చాయి.
పునర్నవి హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాక రాహుల్ ను గెలిపించాలని తన ఫ్యాన్స్ ను కోరింది. బిగ్ బాస్ సీజన్ 3విన్నర్ గా రాహుల్ గెలుపొందాక వీరిద్దరూ అక్కడక్కడ కనిపించడంతో పున్నూ బేబి- రాహుల్ లు ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. కాని తమ ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చి ఊహాగానాలకు తెరదించారు.
తాజాగా అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది పునర్నవి. తాను అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు ప్రకటించింది. కొన్ని రోజులుగా తాను ఊపిరితిత్తుల సమస్యలతో బాధ పడుతున్నట్టు ఆమె తెలిపింది. కొత్త సంవత్సరాన్ని అనారోగ్యంతో ప్రారంభిస్తున్నానని వెల్లడించింది.
తాను అనారోగ్యం బారిన పడటం ఇదే చివరి సారి కావాలని భగవంతుడిని కోరుకుంటున్నానని పున్ను బేబి తెలిపింది. సోషల్ మీడియాలో ఈ మేరకు పునర్నవి పెట్టిన మెసేజ్ ఆమె అభిమానులను చాలా బాధకు గురి చేస్తోంది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Also Read : రష్మీ ని పోర్న్ స్టార్ తో పోల్చిన రామ్ ప్రసాద్