యాంకర్ ప్రదీప్ అంటే తెలియని వారుండరు. తనదైన యాంకరింగ్ తో జనాలను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. టాలీవుడ్ బుల్లితెర యాంకరింగ్ లో మెగాస్టార్ అని చెప్పొచ్చు. అయితే…ప్రదీప్ ను ఎఫైర్, పెళ్లి వార్తలు చుట్టుముడుతునే ఉన్నాయి.
ఇటీవల ప్రదీప్ మ్యారేజ్ న్యూస్ హైలెట్ అయింది. ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతు అనే అమ్మాయిని ప్రేమించిన ప్రదీప్ మ్యారేజ్ చేసుకోనున్నారని ప్రచారం జరిగింది. ఈ వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. దాంతో ప్రదీప్ పెళ్లి వార్తలపై క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం తన పెళ్లి గురించి జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు ప్రదీప్. నవ్య మారోతు కాదు కదా. నాకు ఎలాంటి రిలేషన్స్ లేవు అన్నారు. తాను రిలేషన్ తో ఉన్నదల్లా..టెలివిజన్ షోస్ తోనేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన ఫోకస్ అంత కెరీర్ పైనే ఉందని.. పెళ్లి గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేశారు.
మీ గోల్ ఏమిటని ప్రదీప్ ను అడగ్గా.. జనాలను ఎంటర్టైన్ చేయడమే తన గోల్ అన్నారు. ప్రదీప్ స్క్రీన్ పై కనిపిస్తే మనోడు వచ్చాడు అనుకోవాలి. ఎంటర్టైన్ చేశాడన్న భావన కలగాలి అన్నారు.