ప్రముఖ ఓటిటి సంస్థ ఆహకు అన్ స్టాపబుల్ కాసుల వర్షం కురిపిస్తోంది. బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న ఈ టాక్ షో కు ఆడియెన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇతర టాక్ షో లకు భిన్నంగా అన్ స్టాపబుల్ టాక్ షో విత్ NBK ను రూపొందించటం ఒక ఎత్తైతే.. స్టార్ హీరోలతో ఈ షో ను ప్లాన్ చేయడం మరో ఎత్తు. ఈ షో కు గెస్టులుగా వస్తున్న సెలబ్రిటీల జీవితాల్లోని కాంట్రవర్సి , రూమర్స్ పై బాలయ్య ప్రశ్నిస్తుండటం ఆసక్తి కల్గిస్తోంది.
న్యూ ఇయర్ సందర్భంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ ను రంగంలోకి దించారు. ప్రభాస్ పై అన్ స్టాపబుల్ షో రెండు ఎపిసోడ్స్ గా ప్లాన్ చేశారు.మొదటి ఎపిసోడ్ ను డిసెంబర్ 29న రిలీజ్ చేశారు. రాత్రి తొమ్మిది గంటలకు ప్రభాస్ ఎపిసోడ్ ప్రసారం అవుతుందని ప్రకటించడంతో ఆహకు ఆడియన్స్ పోటెత్తారు. లక్షలాది మంది ఆడియన్స్ ఆహ లో లాగిన్ కావడంతో దెబ్బకు యాప్ క్రాష్ అయింది. దీంతో అభిమానులు హార్ట్ అయ్యారు. వారి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు సోషల్ మీడియాలో ఆహ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. సాంకేతిక లోపం తలెత్తడంతో షో ఆగిపోయిందని చెప్పారు. మా టీం ప్రాబ్లం సాల్వ్ చేస్తుందని చెప్పుకొచ్చింది.
అర్దరాత్రి తరువాత ఆహ టీం సమస్యను సాల్వ్ చేసే నాటికీ ఆడియన్స్ పడుకున్నారు. ఓ భారీ రికార్డ్ సెట్ చేసే చాన్స్ ను ఆహ కోల్పోయింది. అంతేకాదు ఆదాయం కూడా దెబ్బతిన్నది. అయినా, ప్రభాస్ ప్రభంజనానికి కొత్త రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి. కేవలం 12 గంటల్లో 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసింది. ఇది ఓటీటీ రంగంలో సరికొత్త చరిత్ర.
ఈ షో లో ప్రభాస్ పెళ్లి, ప్రేమ విషయాలపై బాలయ్య ప్రశ్నించినట్లు ప్రోమోలో చూపించారు. దాంతో ఈ విషయాలపై ప్రభాస్ ఎలాంటి క్లారిటీ ఇస్తాడోనని ఆడియెన్స్ లోనూ ఆతృత కనిపించింది. ప్రభాస్ ఎలాంటి విషయాలను చెప్తాడోనని అందరిలోనూ ఓ ఎగ్జైట్మెంట్. సినిమా విడుదల సమయంలో తప్ప మిగతా సమయంలో ప్రభాస్ మీడియా ముందుకు అసలే రారు. ఈ క్రమంలోనే ఈ క్రమంలో బాలయ్య-ప్రభాస్ ల ఎపిసోడ్ పై ఎక్కడ లేని క్రేజ్ ఏర్పడింది.