పాన్ ఇండియా హీరో ప్రభాస్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో చికిత్స కోసం ప్రభాస్ ను విదేశాలకు తీసుకెళ్లారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు నమ్మశక్యంగా అనిపించకపోయినా…కొన్ని రోజులుగా ప్రభాస్ రెగ్యులర్ గా షూటింగ్ కు కూడా అటెండ్ కాలేదని సమాచారం బయటకు రావడంతో ఈ వార్తను కొట్టిపారేయలేమని సినీ ఇండస్ట్రీకి చెందిన వారు అభిప్రాయపడుతున్నారు.
ప్రభాస్ ఆరోగ్యంపై పలు రకాల ప్రచారం జరుగుతోండటంపై ప్రభాస్ సన్నిహితులను సంప్రదించగా ఈ వార్తను ఖండించారు. ప్రభాస్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని… కాకపోతే ఆయన స్వల్ప అస్వస్థతకు గురైన మాట వాస్తవమేనని వెల్లడించారు. ప్రభాస్ వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్నారు. విరామం లేకుండా ఈ షూటింగ్ లో పాల్గొనడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.
ఇక ఆదిపురుష్ టీజర్ రిలీజ్ సమయంలో ప్రభాస్ మోకాళ్లకు ఆపరేషన్ జరిగింది. ఇక అప్పటి నుంచి ప్రభాస్ తరుచుగా అనారోగ్యానికి గురవుతున్నారని సమాచారం. దీంతో చికిత్సతో పాటు విశ్రాంతి తీసుకునేందుకు ప్రభాస్ విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలోనే ప్రభాస్ విదేశాలకు వెళ్ళడంతో ఆయన తీవ్ర అనారోగ్యం కారణంగానే విదేశాలకు వెళ్ళారని ప్రచారం చేస్తున్నారు. కానీ రెగ్యులర్ చెకప్ లో భాగంగానే ప్రభాస్ విదేశాలకు వెళ్ళినట్లు తెలుస్తోంది. అంతేకానీ ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడడం లేదని అంటున్నారు.
Also Read : వీకెండ్ మ్యారేజ్ ల వైపు యువత ఆసక్తి – ఇదే ఇప్పుడు నయా ట్రెండ్