మాట ఇచ్చాడంటే.. మాట తప్పడంతే. ఈ డైలాగ్ గుర్తుంది కదా. ఏపీ ఎన్నికల ప్రచారం మొదలుకొని సీఎంగా ప్రమాణస్వీకార సభలోనూ జగన్ నోటి నుంచి పదేపదే జాలువారిన డైలాగ్ ఇది. విద్యుత్ ఒప్పందాలను సమీక్షించి ,కరెంట్ చార్జీలను తగ్గిస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజే జగన్ హామీ ఇచ్చారు.
జగన్ మాటను జనాలు పూర్తిగా నమ్మారు. మాటకు కట్టుబడి ఉంటాడని అనుకున్నారు. కానీ జనాల నమ్మకాన్ని జగన్ వమ్ము చేస్తున్నారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో కరెంట్ చార్జీలను తగ్గించడం దేవుడెరుగు. వరుసగా చార్జీలను పెంచుకుంటూ ప్రజలపై భారం మోపుతూ ఇచ్చిన హామీని విస్మరిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో ఏకంగా ఏడు సార్లు కరెంట్ చార్జీలను పెంచారు.
మరోసారి కరెంట్ చార్జీలను పెంచేందుకు రెడీ అయ్యారు. ట్రూ అప్ పేరుతో ప్రతీ నెలా బాదేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు ఏపీఈఆర్‌సీ నుంచి అనుమతి తెచ్చుకున్నారు. ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రతీ నెల ఒక్కో యూనిట్ కు నలభై పైసలు వడ్డించేందుకు ఏపీ సర్కార్ కు అనుమతి లభించింది. ఇది సామాన్య ప్రజలకు అత్యంత భారంగా మారనుంది. ఈ ట్రూ అప్ చార్జీలు బయట నుంచి కరెంట్ కొనుగోలు చేయడం వల్ల పడిన భారానికి వసూలు చేసే చార్జీలు. ఇప్పుడు ఆ భారాన్ని ప్రజలపు మోపుతున్నారు జగన్.
ముందుచూపు లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఏపీ ప్రజలకు తెలిసివస్తోంది. జగన్ గెలిపించి తప్పు చేశామా..? అని ఆలోచిస్తున్నారు. దేశంలోనే అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలోనే ఉన్నాయి. నరకప్రాయమైన రోడ్లు కూడా ఏపీలోనే ఉన్నాయి. అతి ఎక్కువ కరెంంట్ చార్జీలు కూడా ఇక ఏపీలోనే ఉంటాయి. ఏపీ సర్కార్ ప్రజలకు గోరంత ఇచ్చి కొండంత లాగేస్తుందని మరోసారి అర్థం అవుతోంది.
Also Read : ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ – కొడాలి సహా మరో ముగ్గురికి బెర్త్ కన్ఫామ్..!?