మొన్న విమానంలో ఓ దుర్మార్గుడు ఓ మహిళ ముఖం మీద మూత్రం పోసి పైచానిక ఆనందం పొందారు. ఆ వార్త మరువకముందే నిన్న మరో మూర్కుడు కర్ణాటక ఆర్టిసి బస్సులో ఓ మహిళ ముఖం మీద మూత్ర విసర్జన చేసి సభ్యసమాజం తల వంచుకునేలా చేశాడు.
ఆ ముర్కుడి పేరు రామప్ప (25), మెకానిక్ ఇంజనీరింగ్ చదివాడు. కర్ణాటకలోని విజయపురం నుంచి మంగళుర్ వెళ్ళుతున్న కర్ణాటక ఆర్టిసి బస్సు హుబ్బలి సమీపంలోని కిరేసురులోని దాబా ముందు ఆగింది. భోజనం చేయడానికి చాలా మంది దిగారు. ముందు వరుసలో ఓ మహిళ నిడురపోతోంది. రామప్ప ఉన్నట్టుండి ఆమె ముఖం మీద మూత్ర విసర్జన చేసి పైశాచిక ఆనందం పొందాడు. ఆమె మేలుకొని భయంతో కేకలేసింది. అయినా అతను ఆగకుండా అలాగే విసర్జించాడు.
ఈ కేకలు విని డ్రైవర్, కండక్టర్తోపాటు సాటి ప్రయాణికులు వచ్చి అతనిని దేహశుద్ది చేశారు. బస్సు లోంచి దించేసారు. ఆమె బాత్రూమ్ కి వెళ్లి స్నానం చేసేవరకు బస్సుని అప్పారు. ఆ తర్వాత బస్సు కదిలింది. ఎక్కడో అమెరికో శత్రువుల మీద మూత్ర విసర్జన చేసే సైకోలు ఉన్నారని విన్నాము. కానీ నేడు మన దేశంలో చదువుకున్న వాళ్లు కూడా సైకోలుగా మారి ఆడవాళ్ళను ఇలా వేదిస్తే ఎలా? అలాంటి సైకొలను ఎలా శిక్షించాలి? ఇక కొత్త చట్టాలు రాయాలా?