కేసీఆర్ జన్మదినం ఫిబ్రవరి 17న తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఓ పండగలా చేయాలనుకున్నారు. సచివాలయం ప్రారంభం రోజున గ్రామ, గ్రామాన సంబురాలు జరగాలని ఆదేశించారు. సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి పలువురు నేతలను ఆహ్వానించారు. కట్ చేస్తే సచివాలయం ప్రారంభోత్సవాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఇందుకు కారణం. ఎమ్మెల్సీ ఎన్నికలని ప్రభుత్వం చెప్తుంది. ఎన్నికల కోడ్ కు , సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి సంబంధం ఏంటో చెప్పలేదు. ఇది ఓటర్లను ప్రభావితం చేసే అభివృద్ధి కార్యక్రమం కానే కాదు. పూర్తిగా సర్కార్ కు సంబంధించినదే. సచివాలయం ఓపెనింగ్ కు ఈసీ అభ్యంతరం చెప్పదు. పైగా ఈసీని అనుమతులు కూడా అడక్కుండానే సెక్రటేరియట్ ఓపెనింగ్ ను క్యాన్సిల్ చేసుకున్నారు.
సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా కావడంతో అదే రోజున నిర్వహించాలనుకున్న సభ కూడా వాయిదా పడినట్లేనని భావిస్తున్నారు. అయితే సచివాలయం ప్రారంభోత్సవ వాయిదాకు అసలు కారణం. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదమేనని అనుమానాలు బలపడుతున్నాయి.
ఆరో అంతస్తు సీఎంవోలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం విషయాలు సర్కార్ బయటకు రానివ్వలేదు. అయినప్పటికీ సచివాలయం ప్రారంభం ముందుగా నిర్ణయించిన రోజే ఉంటుందని ప్రచారం చేషూర్. చివరికి ఇలా వాయిదా వేయడం…అగ్నిప్రమాద నష్టం తీవ్రంగా ఉండటంతోనేని అంటున్నారు.