హైదరాబాద్ లో వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. సీడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో ఉదయం స్కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలకు వ్యతిరేకంగా పోస్టర్లు కనిపించగా..ఆ తరువాత కేసీఆర్ ఫోటోతో బుక్ మై సీఎం అనే పోస్టర్లు ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది.
ఇటీవలి కర్ణాటక ఎన్నికల సమయంలో అక్కడ పేసీఏం …40 పర్సెంట్ యాక్సెప్టేడ్ పేరుతో బసవరాజ్ బొమ్మై ఫోటోతో పోస్టర్లు వెలిశాయి. ఈ ప్రచారం కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపిందని తేలింది. తాజాగా తెలంగాణలోనూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేసీఆర్ ఫోటోతో బుక్ మై సీఏం – స్కామ్ 2023 అంటూ పోస్టర్లు ప్రత్యక్షం కావడం చర్చనీయాంశం అవుతోంది. ఈ పోస్టర్ల వెనక ఎవరు ఉన్నారనేది స్పష్టత లేదు కాని, ఇది కాంగ్రెస్ పనేనని బీఆర్ఎస్ అనుమానిస్తోంది.
కర్ణాటక ఎన్నికల సమయంలో పేసీఎం అనే ట్యాగ్ ఏవిధంగా ప్రభావం చూపిందో.. తెలంగాణ సీఎంపై అలాగే ప్రయోగించాలని కాంగ్రెస్ వ్యూహరచన చేసి ఉండొచ్చు. అందుకే ఈ విధమైన ప్రచారం చేసి ఉంటుందని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. ఏదీ ఏమైనా తెలంగాణలోనూ పోస్టర్లు జనాల్లో ఓ రకమైన ఆలోచనను రేకెత్తిస్తే బీఆర్ఎస్ కు కష్టకాలం తప్పదని అభిప్రాయపడుతున్నారు పరిశీలకులు.