ఎంత మంచి కూర వండినా, చివరికి బిర్యానీ వండినా ఉప్పు తప్పక ఉండాలి. ఉప్పు లేనిదే ఏ కూర రుచిగా ఉండు. అందుకే ప్రతి కూర ఉప్పుతో అణిగిమణిగి ఉంటాయి. అందుకే ఉప్పుకు గర్వం పెరుగుతంది. నేను లేనిదే ఏ కూర లేదు అనే ఖండకావరం పెరుగుతుంది. అందుకే అన్ని కూరలతో గొడవపడి బయటికి వస్తుంది.
ఇక తనకు అన్ని కురల కంటే ఎక్కువ గౌరవం పెరుగుతుంది అని కూరగాయల మార్కెట్ లో పోటి పడుతుంది. కానీ దానిని సంతలో ఎవ్వరు కొనరు. ఉప్పును ఎవ్వరు ఒక కురలాగా వాడుకోరని ఉప్పుకు అప్పుడు తెలిసి బోరున ఏడుస్తుంది. వెనక్కి వెళ్ళితే అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోతుంది.
ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు కూడా బిఆర్ఎస్ పార్టీ లో ఉప్పులాంటి వాళ్ళు. వాళ్లవల్ల బిఆర్ఎస్ పార్టీకి మేకలు జరిగన మాట వాస్తవం. వాళ్ళ సేవలు ఆ పార్టీ ఎంతో ఉపయోగపడిన మాట కూడా వాస్తవం. కానీ వాళ్ళవాళ్ళే ఆ పార్టీ బతుకుతోంది అనుకోవడం మాత్రం వాళ్ళ బ్రమ.
డబ్బు ఉందనే అహంకారంల్తో వాళ్లు ఎన్నికలల్లో గెలుస్తాం అని పగటి కలలు కంటారు. కానీ ఇలాంటి వాళ్లకు ఒక లేబుల్ అవసరం. ఎంత గొప్ప నాయకుడైనా ఒక పార్టీ లేబుల్ ఉండాలి. ఆ లేబుల్ చూసే ఎవ్వరయిన బాటిల్ కొంటారు. గుడంబా బాటల్ కు కూడా మంచి కంపెనీ లేబుల్ అతికిస్తేనే ఎక్కువ ధరకు అమ్ముడుపోతుంది.
చాలా రాజులుగా పొంగులేటి, జూపల్లితో కెసిఆర్ కి సున్నం పడింది. దానికి కారకులు ఎవ్వరు అన్నది కాసేపు పక్కన పెడదాము. ‘నా వల్లే మీరు బాగుపడ్డారు’ అనే అహంకారం కెసిఆర్ లో ఉంది. అలాగే ‘నా వల్లే మీ పార్టీ గెలిచింది’ అనే అహంకారం అదే స్టాయిలో అటుపొంగులేటికి, ఇటు జూపల్లి కూడా ఉన్నది. ఎవరి ఖండకావరం వాళ్ళకు ముద్దు. దొందు దొందే. అందరు అందరే. ఎవరికి వారు గొప్ప మేధావులు.
అయితే ఇక్కడ పొంగులేటి, జూపల్లి ఇప్పుడు మీడియా ముందుకువచ్చి చెప్పే మాటలే దారుణంగా ఉన్నాయి. ‘కెసిఆర్ నన్ను మెడబట్టి బయటికి గెంటేశాడు. మరి ఇంతకాలం ఎందుకు మెడబట్టి గెంటలేదు?’ అని ఇద్దరు వితండవాదంలోకి దిగుతున్నాడు. దీనికి అర్థం ఏమిటో వాళ్ళకే తెలియాలి. కెసిఆర్ మెదట్టి గెంటేయడం తప్పు కాదా? ఆలస్యంగా గెంటేయడం తప్పా?
వీళ్ళకు నిజంగా పౌరుషం ఉంటే – అసలు కెసిఆర్ మెడబట్టి గెంటేయక ముందే గౌరవంగా రాజీనామాలు చేసి బయటికి రావచ్చుగా? మరి అలా ఎందుకు బయటికి రాలేదు? మరి వీళ్ళు ఎందుకు ఇంత ఆలస్యం చేశారు? అక్కడే అసలు కుట్ర దాగి ఉంది.
తమ పబ్బం గడుపుకోవాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు ఆరాటం. ఈ ఇద్దరు కెసిఆర్ ని తిడుతూ, బెదిరిస్తూ, బ్లాకు మెయిల్ చేస్తూ మంత్రి పదవి డిమాండ్ చేశారు. కనీసం కాంట్రాక్లు ఇస్తే నాలుగు అక్రమాలు చేసి డబ్బులు దండుకోవాలని కుట్ర. పార్టీ వీడడం వీళ్ళ ఉద్దేశ్యం కాదు.
వీళ్ళు ముదురులు అయితే కెసిఆర్ దేశముదురు. ఎంత సహనంలో ఉంటారో అంటే ఉగ్రరూపం దాలుస్తారు. ఎవ్వరిని లెక్క చేయరు. ఎలాంటి అవాంతరం వచ్చిన సిద్ధపడతారు. అందుకే ఆ ఇద్దరినీ మెడబట్టి బయటికి గెంటారు.
రోడ్డున పడ్డది మాతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు మాత్రమే. ఇలా బయటికి వచ్చిన వాడు ఏ ఒక్కడు కూడా బాగుపడలేదు అని కొంత కాలానికి తెలుసుకుంటారు. కానీ అప్పతెకే అంతా అయిపోతుంది.
ఇక్కడ కెసిఆర్ కూడా ఓ నిజం గెలుసుకోవాలి. ఒక చిన్న బొక్క పడవనే ముంచివేస్తుంది. ఇలాంటి అవకాశ వాద రాజకీయ నాయకులవల్ల బిఆర్ఎస్ కి మేలు జరగకపోవచ్చు. కానీ హాని మాత్రం తప్పక జరుగుతుంది. దానిని చక్కటి ఉదాహరణ కెసిఆర్ జీవితమే. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటూ మంత్రి పదవి ఆశించారు. రాలేదు. ఒళ్ళు మండింది. బయటికి వచ్చి టిఆర్ఎస్ పార్టీ పెట్టారు. దాంతో తెలుగుదేశం తెలంగాణలో నామరుపాలు లేకుండా పోయింది. బిజెపి కూడా ఇలాగే అధికారంతో వచ్చింది. కాబట్టి ఉప్పును తక్కవ అంచనా వేయరాదు
Also Read : కాంగ్రెస్ లోకి జూపల్లి, పొంగులేటి.?