తెలంగాణ సీఎం కేసీఆర్ లో కలవరం మొదలైంది. హ్యాట్రిక్ విజయంపై బెంగ పట్టుకుంది. అందుకే కాంగ్రెస్ సోషల్ మీడియాను టార్గెట్ చేశారు. కేసీఆర్ ను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని వెనక టీఆర్ఎస్ నేతలు ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్. అతని ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి మాదాపూర్ లో కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడులు చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఆఫీసులోకి ఎంట్రీ ఇచ్చి హార్డ్ డిస్క్ లు, ముగ్గురి సిబ్బంది ఫోన్లను తీసుకెళ్లారు. కాంగ్రెస్ నేతలు అక్కడికి వచ్చి పోలీసులతో వాదనకు దిగినా ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు ఉండటంతో పోలీసులు తమ పనిని చకచకా కానించేశారు.
కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ కేసీఆర్ ను దూషిస్తూ పోస్టులు పెడుతున్నారని ఆఫీసును సీజ్ చేశారు. మరి, బీజేపీ అనుకూల సోషల్ మీడియాలో నిత్యం అలాంటి కంటెంట్ ఎంతో ఉంటుంది.గతంలో వివరణ కోసం బీజేపీ సోషల్ మీడియా ఆర్గనైజర్లకి ముందుగా నోటీసులు ఇచ్చిన పోలీసులు.. కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ కు ఎలాంటి నోటీసులు ఇష్యూ చేయకుండా ఆఫీసును సీజ్ చేయడం ఏంటన్నది అందరి ప్రశ్న.
బీజేపీ విషయంలో లైట్ లే యారో అన్న కేసీఆర్..కాంగ్రెస్ సోషల్ మీడియా విషయంలో కటువుగా వ్యవహరించడం పట్ల బీఆర్ఎస్ , బీజేపీ ల మైత్రి మరోసారి బయటపడిందని అంటున్నారు. నిజానికి, సునీల్ కనుగొలు టీమ్ ఇస్తున్న కంటెంట్ లో కొన్ని మినహా మిగతాదంతా కేసీఆర్ వైఫల్యాలను వివరిస్తూ రెండు పాయింట్స్ పేర్కొని పోస్టులు పబ్లిష్ చేస్తున్నవే. అయినా, ఏదో అయిపోయింది. మన వైఫల్యాలు ప్రజల్లోకి రీచ్ ఐతున్నాయనే ఆందోళనతో కేసీఆర్ ఈ పని చేసినట్టు చెబుతున్నారు.