జనం మీద పోలీసులు తమ పాశవిక ప్రతాపం చూపుతారని విన్నాము, చూశాము. కానీ కాబోయే పోలీసుల మీదే పోలీసులు తమ దాష్టికం చూపిన వైనం నిన్న బుధవారం రాత్రి 7 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో జరిగింది. దీనివెనక తెలంగాణ ప్రభుత్వం కుట్ర దాగిఉన్నదని తెలుస్తోంది. పోలీసులు, ఎస్ఐ పోస్టుల బర్తిలో తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డ్ తప్పిదాలు అడుగడుగునా బయటపడుతున్నాయి. వాటిని ఎండగట్టేందుకు దరఖాస్తుదారులు యాసం ప్రదీప్, కళ్యాణ్ నిన్న సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ కి బయలుదేరుతుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకుని ఎక్కడికో తరలించారు.
తమకు జరిగిన అన్యాయాన్ని సుప్రీం కోర్టులో కూడా మొరపెట్టుకునే అవకాశం ఈ స్వతంత్ర దేశంలో లేదా? అని సాటి దరఖాస్తుదారులు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ ఉద్యోగాల నియామకంలో మొదటినుంచి తెలంగాణ ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకుని, దరఖాస్తుదారులను ముప్పతిప్పలు పెడుతోంది. లోగడ జరిగిన రాత పరీక్షలో రిక్రూట్మెంట్ బోర్డ్ ఏడు తప్పుడు ప్రశ్నలు ముద్రించి అభ్యర్టుల జీవితాలతో ఆదుకుంది. దరఖాస్తుదారులు యాసం ప్రదీప్, కళ్యాణ్ ఈ తప్పులను ఎండగడుతూ కోర్ట్ ను ఆశ్రయించారు. ఆ కేసుని లోతుగా పరిశీలించిన కోర్ట్ దరఖాస్తు దారులను సమర్థించి, తెలంగాణ ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేసింది. దాంతో తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డ్ అందరికి 7 మార్కులు కలిపి ఫెయిల్ అయిన వాళ్ళను పాస్ చేసింది.
ఆ తరువాత పిజికల్ టెస్ట్ మొదలయ్యింది. అందులో కూడా కొన్ని అవకతవకలు జరిగాయి. దరఖాస్తుదారులు మళ్ళి కోర్ట్ ని ఆశ్రయించారు. ఆ కేసుని కూడా లోతుగా పరిశీలించిన కోర్ట్ మళ్ళి దరఖాస్తు దారులనే సమర్థించి, తెలంగాణ ప్రభుత్వన్ని ఎప్పటిలా మొట్టికాయలు వేసింది. అయినా బుద్దిరాని రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారులు నియమకలల్లో కూడా తప్పిదాలు చేశారు.
ఆగ్రహించిన అభ్యర్టులు ఒక సంఘం లా ఏర్పడ్డారు. దానికి దరఖాస్తుదారులు యాసం ప్రదీప్, కళ్యాణ్ నాయకత్వం వహిస్తున్నట్లు హోం మంత్రికి తెలిసింది. వాళ్ళు సుప్రీం కోర్టులో మరో కేసు వేస్తే తమ పరువుపోతుందని భావించి, వాళ్ళు ఢిల్లీకి వెళ్ళకుండా ఆదిలోనే అడ్డుకుంటూ 498 సెక్షన్ ‘ఏ’ కింద అరెస్ట్ చేసి ఎక్కడో దాచారు గోదావరిఖని టౌన్ -1 పోలీసు. అయితే కళ్యాణ్ ని ఇంటికి పంపినట్లు గోదావరిఖని టౌన్ -1 పోలీసు అధికారులు చెప్పినప్పటికీ, అతని సెల్ ఫోన్ ఆఫ్ చేసి ఉన్నది. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది. దీనితో మిగతా దరఖాస్తుదారులు కన్నెర్ర చేసి ఆందోళనకు సిద్దమవుతున్నారు.