Phone Tapping Case Is Going To KCR NECK ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసుతో ప్రమేయం ఉన్న వారి పేర్లు ఒక్కొక్కరిగా బయట పడుతుండటంతో బీఆర్ఎస్ కీలక నేతల్లో టెన్షన్ మొదలైంది. తమ పేర్లు బయట పడుతాయా అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తుండటం..అధికారులంతా తాము గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పడంతో నెక్స్ట్ విచారణకు ఎవర్ని పిలుస్తారు..? అని టెన్షన్ పడుతున్నారు.
కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో ఎవరిని కలుస్తున్నారు..? ఎక్కడ కలుస్తున్నారు..? ఏం మాట్లాడుతున్నారు..? అనే వాటన్నిటినీని గుర్తించి దానికి కౌంటర్ గా ఏం చేయాలనే ప్లాన్ తో బీఆర్ఎస్ వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆషామాషీగా తీసుకోవడం లేదు.సీరియస్ గానే ఉన్నారు. దాంతో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుంది అని అనే చర్చ పార్టీలో జరుగుతోంది. అసలే లోక్ సభ ఎన్నికల ముంగిట అనేక అవినీతి ఆరోపణలు, కేసులు నమోదు అవుతుండటం బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చి కేసీఆర్ లేదా కేటీఆర్ ను విచారణకు పిలుస్తారు..? అనే అభిప్రాయాలు వినబడుతున్నాయి.
ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి వచ్చినా అది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇలాంటి నేరాలకు పాల్పడుతారా..? అనే చీదరింపులు జనాల నుంచి వ్యక్తం కానున్నాయి. ఇలాంటి వ్యవహారాలతోనే అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని బీఆర్ఎస్ చూసిందా..? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. అప్పుడు బీఆర్ఎస్ విశ్వసనీయత కే అది మచ్చగా మిగిలి పోతుంది. వీటన్నింటిని ఏదుర్కొని బీఆర్ఎస్ బాస్ ఎలా ముందుకు సాగుతారో చూద్దాం..!!
https://www.youtube.com/watch?v=TKXxoRCmrDY&t=70s