జనసేన పదో ఆవిర్భావ సభలో నిన్న పవన్ కళ్యాణ్ ఉద్వేగభరిత ప్రసంగిస్తూ వంగవీటి రాధా ‘కులం’ పుట్టుపూర్వోత్తరాలను బయటపెట్టి ఎన్నో సంచలనాలకు తెర లేపారు. వంగవీటి రాధా తండ్రి వంగవీటి మోహన రంగా కాపు వర్గానికి గుడి లేని దేవుడు. కానీ రంగకు అసలు ఏ కులం ఫీలింగ్ లేదు అన్నార. ఆ విషయం చాటు కోడానికే అయన కావాలని కమ్మ సామజిక వర్గానికి చెందిన ఆడపడుచును పెళ్లి చేసుకున్నారు అని పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. ఈది చాలామందికి తెలియదు అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఆ రెండు కులాల కలయికవల్ల పుట్టినవాడే వంగవీటి రాధా అని వివరించారు. ఇప్పుడు వంగవీటి రాధా ఏ కులానికి చెందినవాడు? అని సభలో ప్రశ్నించాడు. నిజానికి వంగవీటి రాధాకు కూడా ఎలాంటి కులం ఫీలింగ్ లేదు అని మెచ్చుకున్నారు.
ఇంకా లోతుకు వెళ్ళితే కాపు సామజిక వర్గానికి చెందిన తాను కూడా కమ్మ సామజిక వర్గానికి చెందిన ఆడపడుచును పెళ్లి చేసుకున్నాను అని చెప్పారు. తనకు కూడా ఏ కులం ఫీలింగ్ లేదని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శం మరొకటి లేదు అని వివరణ ఇచ్చారు.
అసలు నాయకులకు కులం ఫీలింగ్ ఉండదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటి వాడే ఉత్తమ నాయకుడు అన్నారు. తనకు తెలిసి చాలా మంది కాపు సామజిక వర్గానికి చెందిన వాళ్ళు కమ్మ సామజిక వర్గానికి చెందిన వాళ్ళను పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా ఉన్నారు అన్నారు.
ఈ రెండు వర్గాలు ఇంకా కులాల పేరుతో కుమ్ములాడు కుంటుపోతే 2050 నాటికి కూడా అంధప్రదేశ్ ప్రగతి సాధించలేదు అని బాధపడ్డారు. తెలంగాణ బగుపడడానికి ఇదే మూల సూత్రం అన్నారు.
కమ్మా, కాపు కులాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం అని హితవు చెప్పారు. ముఖ్యంగా నేటి యువత కులం ఫీలింగ్ పోగొట్టుకోవాలి అన్నారు. పాత తరం వాళ్ళకు కులం ఫీలింగ్ ఉండటంలో అర్థం ఉంది. కానీ గొప్ప గొప్ప చదువులు చదివిన యువత కూడా కులాల పేరుతో కొట్టుకు చావడం బాధాకరం అన్నారు.