శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉగ్రరూపం ప్రదర్శించారు. పవన్ ను కెలికితే ఎలా ఉంటుందో రుచిచూపించారు. ఒక్కొక్కరిని పాయింట్ అవుట్ చేస్తే ఇచ్చి పడేశారు. జగన్ పేరును ఎక్కడ ప్రస్తావించకుండానే మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ కొత్త పేరుతో పిలిచారు. ఈ పేరు భలే గమ్మత్తుగా ఉండటంతో ఇక నుంచి జగన్ ను మూడు ముక్కల సీఎంగానే పిలుస్తారేమో.
పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తోన్న మంత్రి అంబటి రాంబాబుకు నేరుగా వార్నింగ్ ఇచ్చారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేయలనిపిస్తే తన దగ్గరకు వచ్చి మాట్లాడాలని.. అప్పుడు చెప్పులతో బడితెపూజ చేస్తానని హెచ్చరించారు. మెగా ఫ్యామిలీపై విమర్శలు చేస్తోన్న రోజాను కూడా విమర్శించారు పవన్. మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు ప్రస్తావించకుండా వెధవా.. నీ పేరు కూడా గుర్తు పెట్టుకుంటాం ఏంట్రా ? అని పవన్ ఇచ్చి పడేశారు. వ్యక్తిగతంగా మాట్లాడాలంటే మూడు ముక్కల ముఖ్యమంత్రి స్కూల్ జీవితం దగ్గర నుంచి తెలుసని పవన్ హెచ్చరించారు.
శీలవతి అనే గంజాయితో ఏపీ ఈ మధ్య ప్రపంచంలో పేరు పొందింది. ఈ గంజాయి తీసుకుని మన సంబరాల రాంబాబులాగా ఏదైనా మాట్లాడవచ్చన్నారు.వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే ఒరేయ్ నేను మీకు దేవుడిని రా.. కాళ్లకు దండం పెట్టుకోండని సలహా ఇచ్చారు. సలహాలు ఇచ్చేవాడు సజ్జల అయితే రాష్ట్రం సర్వనాశనం అవుతుందంటూ రైమింగ్ పదాలతో సభికులను ఉత్సాహపరిచారు పవన్. జగన్ నుద్దేశించి మీ నాన్ననే ఎదుర్కున్నానయ్యా… మూడుముక్కల ముఖ్యమంత్రీ.. పంచలూడదీసి కొడ్తా అని చెప్పా. నీకు భయపడుతనా అని ప్రశ్నించారు.
ఈ సభ ద్వారా పొత్తులపైన కూడా పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. గౌరవం తగ్గకుండా ఉంటే కలిసి వెళతామని ప్రకటించారు. మీరు బలం ఇస్తే ఒంటరిగానే వెళ్తానన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ టెక్నికల్ గానే గెలిచిందని.. అందుకే ఈ సారి ఓట్లు చీలకూడదని అంటున్నానని ప్రకటించారు. అంటే దాదాపు టీడీపీతో వచ్చే ఎన్నికల్లో కలిసి సాగే అవకాశం ఉందన్నది స్పష్టం అవుతోంది.
పవన్ కళ్యాణ్ ప్రసంగం పూర్తి వీడియో కోసం కింది వీడియో చూడండి