ఏపీలో ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే అప్పుడే అభ్యర్థిని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు ఇంకా అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ప్రారంభించలేదు. జనసేనాని మాత్రం తెనాలి అభ్యర్థిని ప్రకటించారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేస్తారని పవన్ వెల్లడించారు.
టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందని ఇరు పార్టీల ముఖ్య నేతలు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించడం చర్చనీయాంశం అవుతోంది. పొత్తులపై ఇరు పార్టీలు అవగాహనకు వచ్చాయని – త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని ప్రచారం జరుగుతున్న వేళ పవన్ ఏకపక్షంగా అభ్యర్థిని ఎలా ప్రకటిస్తాడు..? అంటే పొత్తు లేదా..? అనే చర్చ జరుగుతోంది.
తెనాలి నుంచి టీడీపీ తరుఫున ఆలపాటి రాజా పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఆయనకు డెబ్బై వేల ఓట్లు వచ్చాయి. జనసేన నుంచి పోటీ చేసిన నాదెండ్లకు కేవలం పాతిక వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీ – జనసేన పొత్తు కుదిరితే జనసేన ముఖ్య నేత నాదెండ్లను మరోచోట నుంచి పోటీ చేయిస్తారన్న వార్తలు వచ్చాయి. మరోవైపు.. ఆలపాటి వయస్సు రీత్యా నాదెండ్లకు పొత్తు అవహగనలోనే టికెట్ ఖరారు చేశారా ..? అనే సందేహాలు వస్తున్నాయి.
ఏదీ ఏమైనా టీడీపీ – జనసేన పార్టీలు పొత్తులపై ఓ క్లారిటీకి వచ్చాయని ప్రచారం జరుగుతోన్న వేళ జనసేనాని తెనాలి అభ్యర్థిని ప్రకటించడం హాట్ టాపిక్ అవుతోంది. పొత్తులపై మరింత విస్తృత చర్చ జరిగేలా చేస్తోంది.
Also Read : పురందేశ్వరి ఇమేజ్ డ్యామేజ్ చేసిన నిర్మలా సీతారామన్..!