పావలా శ్యామల… పాత్ర ఏదైనా అందులో యిట్టె ఇమిడిపోవడం ఈమె ప్రత్యేకత. పలు టీవీ సీరియల్ లో, సినిమాలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న శ్యామల ప్రస్తుతం ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది.
వయో భారంతో సినిమాలో, సీరియల్స్ లో అవకాశాలు రావడం లేదు. దీంతో శ్యామల పూట గడవడమే కష్టంగా మారింది. దీనికితోడు కూతురి అనారోగ్య పరిస్థితి శ్యామలను మరింత కుంగదీస్తోంది. ఈ సమయంలోనే ఓ ఇంటర్వ్యూలో శ్యామల మాట్లాడుతూ తన ఆర్ధిక పరిస్థితిపై ఓపెన్ అయింది.
నేను కష్టాల్లో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి నన్ను ఆదుకున్నారు. “మా” లో సభ్యత్వాన్ని ఇప్పించి, ప్రతి నెల సాయం అందేలా చేశారు. ఆయన చేసిన సాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పారు శ్యామల.
మహేష్ బాబు, ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు తనకు ఒక్కొక్కరు పదిలక్షల చొప్పున ఆర్ధిక సాయం చేసినట్లు జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. వారిచ్చిన డబ్బులతో తాను హ్యాపీగా ఉన్నట్లు ప్రచారం చేసి.. తనకు అందే చిన్న చిన్న సాయాలు కూడా అందకుండా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది శ్యామల. ఇదంతా ఓ మహాతల్లి చేసిందంటూ చెప్పింది.