బీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. కర్ణాటక ఎన్నికల్లో విజయం దక్కడంతో మంచి ఊపు మీదున్న కాంగ్రెస్ అదే జోష్ లో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. కర్ణాటక ఎన్నికల ఫార్ములాను తెలంగాణలో అనుసరిస్తామని టీపీసీసీ ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కంటే ముందుగానే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి ఆయా నియోజకవర్గాల్లో పని చేసుకోమని అభ్యర్థులకు సూచించారు. ఈ వ్యూహం కర్ణాటకలో సక్సెస్ అయింది. అదే వ్యూహాన్ని ఇప్పుడు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసే దిశగా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తును కాంగ్రెస్ ముమ్మరం చేసింది.
Also Read : మెదక్ లో గాలి అనిల్ కుమార్ మార్క్ రాజకీయం
ముందుగా కొన్ని నియోజకవర్గాలను ఎంపిక చేసిన కాంగ్రెస్..ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు ప్రజలకు చేరువ అయ్యేలా ప్రచారం చేసుకోవాలని సూచించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని స్పష్టం చేసిన ఏఐసీసీ… పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీమ్ తో సర్వేలు కూడా పూర్తి చేయించినట్లు సమాచారం. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ తరుఫున ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది..? ఎవరికీ ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉన్నాయి.?అనే అంశాలతో సర్వే చేయగా మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ గాలి అనిల్ కుమార్ వైపు ఎక్కువ మంది ఓటర్లు మొగ్గు చూపారని తెలుస్తోంది.
Also Read : మెదక్ లో గాలి అనిల్ కుమార్ మార్క్ రాజకీయం
మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ గా కొనసాగుతున్న గాలి అనిల్ కుమార్ కు పార్లమెంట్ సెగ్మెంట్ అంత మంచి ఆదరణ ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ లో కొనసాగి ఉద్యమ నేతగా అందరికీ సుపరిచితులైన గాలి అనిల్ కుమార్ ఆ పార్టీకి ఆర్థికంగా చేయూతనందించాడు. కానీ టీఆర్ఎస్ లో తన కష్టానికి తగ్గ ఫలితం దక్కకపోవడంతో ఆయన టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎదుగుదలకు కృషి చేస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ హేమాహేమీల ఇలాకాలు ఆయన నియోజకవర్గం పొరుగునే ఉన్నప్పటికీ… కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటూ మనోధైర్యం కల్పిస్తున్నారు. పార్టీ చేసే ప్రతి కార్యక్రమంలోనూ ఆయన మార్క్ ఉంటుంది.
Also Read : గాలి అనిల్ కు ఈడీ నోటిసులు- తెర వెనక కేసీఆర్..!?
గాలి అనిల్ సేవలకు మెచ్చిన అధిష్టానం 2018ఎన్నికల్లో ఆయనకు పటాన్ చెరు టికెట్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఓ సీనియర్ నేత లాబియింగ్ తో ఆయనకు దక్కాల్సిన టికెట్ కాట శ్రీనివాస్ గౌడ్ కు దక్కింది. అయినా ఏమాత్రం అసంతృప్తికి లోనుకాకుండా పార్టీకోసం పని చేస్తూ వచ్చారు. 2019పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లోక్ సభ నుంచి పోటీ చేసిన గాలి అనిల్ కు 2లక్షల పైచిలుకు ఓట్లు వచ్చాయి. దాంతో ఆయనకు నియోజకవర్గంలో ఎంత పట్టుందో పార్టీ నాయకత్వానికి కూడా అర్థమైంది. ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో పారిశ్రామిక ప్రాంతమైన పటాన్ చెరు నుంచి ఎవరికీ అవకాశం ఇస్తే గెలుపు సాధ్యం అవుతుందని కాంగ్రెస్ అభిప్రాయ సేకరణ చేయగా గాలి అనిల్ కుమార్ పేరును సిఫార్స్ చేసినట్లుగా తెలిసింది.
Also Read : వారెవ్వా .. గాలి అనిల్ కుమార్ ఖతర్నాక్ డిమాండ్
పటాన్ చెరు మాత్రమే కాదు నర్సాపూర్ నియోజకవర్గంలోనూ ఆయనకు గెలుపు అవకాశాలు ఉన్నాయని తేలాయి. దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుంచి గాలి అనిల్ కుమార్ పోటీలో ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయనకు ఏఐసీసీ నుంచి అండదండలు ఉండటం కూడా కలిసొచ్చే అంశమని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
Also Read : ప్రియాంక గాంధీ కోసం సీటు త్యాగం చేసేందుకు గాలి అనిల్ రెడీ..!