టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో టీమిండియా నిరాశ పరచడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయింది. జట్టును నడిపించడంలో రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడన్న విమర్శల నేపథ్యంలో మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్ లను ఎంపిక చేయాలని భావిస్తోంది.
మూడు ఫార్మాట్లకు రోహిత్ శర్మ ఒక్కడే సారధిగా వ్యవహరిస్తూ ఉండటంతో హిట్ మ్యాన్ పై ఒత్తిడి పెరుగుతుందని బీసీసీఐ భావిస్తోంది. కొత్త సెలక్షన్ కమిటీ ఏర్పాటు కాగానే..వన్డే, టెస్ట్ లతోపాటు టీ 20లకు వేర్వేరుగా కెప్టెన్ లను ఎంపిక చేయనుంది.
Pandya as the captain of Team India..?
టీ-20ఫార్మాట్ కు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, వన్డే లకు రోహిత్ శర్మను కెప్టెన్ గా ఎంపిక చేయనున్నట్లు బీసీసీఐకి చెందిన కీలక అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. అయితే, టెస్ట్ లకు సారధ్యం వహించే బాధ్యతలను ఎవరికీ కట్టబెట్టాలన్నది దానిపై ఇంకా నిర్ణయం నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
ఐపీఎల్ లో గుజరాత్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించిన పాండ్యా ఆ జట్టుకు అవసరమైన సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడి విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని టీమిండియా టీ-20సారధిగా ఎంపిక చేసేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.