ఏపీ టీడీపీ నేతలు చెప్పిందే జరిగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించారు. ఆ పార్టీకి సాంకేతికంగా 23ఓట్లు ఉన్నాయి. అనురాధకు కూడా 23ఓట్లు వచ్చాయి. వాస్తవానికి 22ఓట్లు వస్తే అభ్యర్థి విజయం సాధిస్తారు. కానీ అనురాధకు ఓ ఓటు ఎక్కువే వచ్చింది. దాంతో ఆమె ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
టీడీపీ తరుఫున 23మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అందులో వైసీపీలోకి నలుగురు ఫిరాయించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతున్నారు. ఈ లెక్కన చూస్తె టీడీపీకి 19ఓట్లు మాత్రమే ఉన్నాయి. మరి ఇంకో నాలుగు ఓట్లు ఎలా వచ్చాయంటే.. వైసీపీ నుంచే నలుగురు ఎవరో క్రాస్ ఓటింగ్ చేశారన్నది అర్థం అవుతుంది. వారిలో ఇద్దరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , ఆనం రాంనారాయణరెడ్డిలు కాగ మరో ఇద్దరు ఎవరు అనేది ఎవరికీ తెలియడం లేదు.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వైసీపీ క్యాంప్ రాజకీయాలు చేసింది.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడు ఎమ్మెల్సీ సీట్లు గెలవాలని జగన్ పంతం పట్టారు.టీడీపీ అభ్యర్థిని ఓడించాలని పగబట్టారు. క్రాస్ ఓటింగ్ జరగకుండా ఎమ్మెల్యేలకు అవగాహనా కల్పించింది. కానీ ఎవరో సైలెంట్ గా టీడీపీకి ఓట్లేశారు. వారెవ్వరో వైసీపీ నేతలకు కూడా స్పష్టత లేకుండా పోయింది.
వైసీపీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఝలక్ ఇచ్చారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలలో ఎమ్మెల్యేలను సంప్రదించకపోవడం.. ఏమాత్రం పట్టించుకోకపోవడంతో చాలా మంది ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. వారంతా జగన్ కు బుద్ది చెప్పేందుకు ఎదురుచూస్తున్నారని ఇటీవల టీడీపీ నేతలు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ ఫలితాలు రావడంతో నిజంగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని ఓ క్లారిటీ వచ్చినట్లు అయింది. ఈ ఫలితంతోనైనా జగన్ కు కళ్ళు తెరుస్తారో లేదో చూడాలి.
Also Read : టీడీపీలోకి 16మంది వైసీపీ ఎమ్మెల్యేలు – వైసీపీ క్యాంప్ లో కలవరం