మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేందుకు అధికార టీఆర్ఎస్ అడ్డదారులు తొక్కుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య నేతలను ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకున్న టీఆరెఎస్.. తాజాగా మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన పల్లె రవి కుమార్ ను కూడా కొనుగోలు చేసింది. కాంగ్రెస్ నాయకులే లక్ష్యంగా సంతలో సరకులా ఇబ్బడిముబ్బడిగా కొనుగోళ్ళు జరుపుతున్నారు. శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో చుర్రుగా కనిపించిన పల్లె రవి ఆ తరువాత కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో కనిపించారు. అ తరువాతే టీఆఆర్ఎస్ నేతలు పల్లె రవితో టచ్ లోకి వచ్చారని.. దాంతో భారీ మొత్తంలో ఆఫర్ చేయడంతో ఆయన పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. అయితే, బీజేపీ, టీఆర్ఎస్ లు కాంగ్రెస్ ను దెబ్బతీసే లక్ష్యంతో నేతలను కొనుగోలు చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బీజేపీలోకి చేరికపై మాజీ ఎంపీ బూర నర్సయ్య శుక్రవారం క్లారిటీ ఇచ్చారు. బూర చేరికతో మునుగోడులో కాషాయ పార్టీ పుంజుకుంటుందని బీజేపీ బలం సోషల్ మీడియా జోరుగా ప్రచారం చేసుకుంది. ఆ మరుసటి రోజే వ్యూహాత్మకంగా పల్లె రవిని టీఆర్ఎస్ లో చేర్చుకోవడం చూస్తె రెండు పార్టీలు కాంగ్రెస్ ను దెబ్బతీయాలనే వ్యూహంతో ఉన్నాయనేది స్పష్టం అవుతుందని పొలిటికల్ పండితులు హెచ్చరిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ రెండు పార్టీలు టచ్ లోకి వచ్చాయని.. కాంగ్రెస్ శ్రేణుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు టీఆరెస్ , బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని అంటున్నారు. అందుకే, పోటాపోటీగా నేతలను చేర్చుకుంటూ బీజేపీ , టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందనే తప్పుడు సందేశాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా..పల్లె రవికి టీఆర్ఎస్ ఐదు కోట్లు ఆఫర్ చేసినట్లుగా మునుగోడు పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. చండూర్ ఎంపీపీగా ఆయన భార్య కొనసాగుతుండటం.. కొంత ఓటు బ్యాంక్ ను ప్రభావితం చేసే నాయకుడు కావడంతో పల్లెకు ఐదు కోట్లు ఇచ్చి కొనుగోళ్ళు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ అద్యక్షుడిగా కొనసాగుతోన్న పల్లె రవికి జర్నలిస్ట్ విలువలకు తిలోదకాలు ఇచ్చారని మండిపడుతున్నారు.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.