భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దేశం ముస్తాబు అవుతుండగా ఒకే రోజు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. యూపీకి చెందిన ఓ యువకుడిని ప్రేమించిన పాక్ మహిళ సీమా హైదర్ భారత జాతీయ జెండాను ఎగరేసి.. భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేసింది. అలాగే, ఓ ఉగ్రవాది సోదరుడు కూడా జాతీయ జెండాను ఎగరేయడం గమనార్హం. తాజాగా ఈ రెండు సంఘటనలకు సంబంధించిన వీడియోలే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
జాతీయ జెండా ఎగరేసిన పాక్ మహిళ
పూర్తి వివరాల్లోకి వెళ్తే…పాక్ కు చెందిన సీమా హైదర్ అనే మహిళకు యూపీకి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. పబ్జీ గేమ్ తో ఈ పరిచయం కుదిరి ప్రేమకు దారికి తీసింది. దాంతో ఆమె తన నలుగురు పిల్లలతో కలిసి ఇండియా వచ్చేసింది. ఇటీవల కేంద్రం ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా అభియాన్ లో పాల్గొన్న ఆమె.. తాజాగా తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగరేసింది. అనంతరం హిందుస్థాన్ జిందాబాద్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేసింది.
మువ్వన్నెల జెండా ఎగరేసిన ఉగ్రవాది సోదరుడు :
హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది జావెద్ మట్టూ సోదరుడు రయీస్ మట్టూ సోపోర్ లోని తన నివాసం వద్ద భారత జాతీయ జెండాను ఎగరేశాడు.తన సోదరుడు ఇంకా ఉంటే ఉగ్రవాదాన్ని వీడి రావాలని రయీస్ మట్టూ కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రెండు వీడియోలను షేర్ చేస్తూ.. భారతీయులుగా గర్వ పడదాం.. ఉగ్రవాదాన్ని తరిమికొడదాం అంటూ క్యాప్షన్ ఇస్తున్నారు.