బీహార్ లో జరుగుతోన్నఇంటర్ సెకండరీ సర్టిఫికేషన్ బోర్డు పరీక్షల సందర్భంగా ఓ ఎగ్జామ్ సెంటర్ లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. పరీక్షా కేంద్రానికి వెళ్ళిన ఓ విద్యార్ధి ఎగ్జాం రాసేందుకు హాల్ లోకి వెళ్లి అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..మనిష్ శంకర్ అనే విద్యార్ధి నలందాలోని అల్లమా ఇక్బాల్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. సెకండరీ సర్టిఫికేషన్ బోర్డు పరీక్షలో భాగంగా బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్ లో అతను పరీక్ష రాయాల్సి ఉంది. పరీక్ష రాసేందుకు వెళ్ళిన ఆ విద్యార్ధి.. ఎగ్జామ్ సెంటర్ లో అమ్మాయిలను చూసి షాక్ అయ్యాడు.
పరీక్షా కేంద్రం మొత్తం వెతికినా ఒక్కరంటే ఒక్క అబ్బాయి కూడా కనిపించలేదు అతనికి. దాంతో కాస్త భయం భయంగానే పరీక్ష హల్ లోకి వెళ్ళిన మనీష్… అమ్మాయిలను చూసి బెరుకుతో కళ్ళుతిరిగి పడిపోయాడు. వెంటనే ఆ స్కూల్ సిబ్బంది మనీష్ ను ఆసుపత్రికి తరలించారు.
ఆ పరీక్షా కేంద్రంలో 500మంది అమ్మాయిలు ఉండగా.. అంతమందిలో అబ్బాయి ఒకడే కావడంతో కంగారుపడి ఇలా జరిగిందని మనీష్ మేనత్త తెలిపింది. ఒక్క అబ్బాయిని అంతమంది అమ్మాయిల మధ్య ఎలా వేశారని ఆమే ప్రశ్నించారు.
अजब-गजब! नालंदा में बिहार बोर्ड 12वीं की परीक्षा के दौरान एक छात्र को 500 लड़कियों के बीच बैठा दिया गया. नतीजा देखिए- लड़का बेहोश हो गया. नर्वस होकर गिर गया. परीक्षार्थी मनीष शंकर को अस्पताल लाना पड़ा…नालंदा से अमृतेश की रिपोर्ट.Edited by @iajeetkumar pic.twitter.com/cJTmaLcfmi
— Prakash Kumar (@kumarprakash4u) February 1, 2023
ఫిబ్రవరి 1, 2023న ప్రారంభమైన ఈ పరీక్షల కోసం 1464 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సారి ఇంటర్ పరీక్షకు మొత్తం 13 లక్షల 18 వేల 227 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో 6 లక్షల 36 వేల 432 మంది బాలికలు, 6 లక్షల 81 వేల 795 మంది బాలురు ఉన్నట్లు బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ కమిటీ వెల్లడించింది.