ఆమధ్య విశాఖపట్నం-సికింద్రాబాద్ రూటులోనూ కొత్తగా ప్రవేశ పెట్టిన ‘వందే భారత్ రైల్’ రైల్ మీద రాళ్ళ దాడులు జరిగాయి. దీని మీద రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ అసలు నేరస్తులు ఇంకా దొరకలేదు. ఇది మరువకముందే నిన్న ప్రారంభించిన ‘మైసూరు-చెన్నై’ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై కూడా దుండగులు రాళ్ళు రువ్వారు.
బెంగళూరు డివిజన్ రూట్‌లో దుండగులు రాళ్లు రువ్విన ఘటనలో నాలుగు బోగిల కిటికీ అద్దాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ప్రయాణికులకు ఎలాంటి దెబ్బలు తగలలేదు. ఈ ఘటనతో ప్రమేయమున్న వారిని గుర్తించేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా అత్యాధునిక హంగులతో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే వందే భారత్ రైళ్లకు 2019 ఫిబ్రవరిలో మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రధాన నగరాలకు అనుసంధానించడం ముఖ్య ఉద్దేశం. రానున్న కాలంలో దాదాపు 400 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం బడ్జెట్‌లో నిధుల కేటాయించింది.
అయితే, ఆదిలోనే హంసపాదు ఉన్నట్టు పట్టాలు దాటుతున్న పశువులను వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. పశుల కాపరులు కోపంతో దాడులు చేసి ఉంటారు అని పోలీసులు తొలుత అనుకున్నారు.
ఇప్పుడు ఆ ఘటనలు కనుమరుగైనా, కొన్ని చోట్ల వందే భారత్ రైళ్లపై రాళ్ల దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. కానీ తగ్గడం లేవు. అన్ని రైళ్ళ మీద కాకుండా కేవలం వందే భారత్ రైళ్ళ మీదే ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి అన్నది ఓ ప్రశ్న గా మిగిలిపోయింది. సికింద్రాబాద్-విశాఖపట్నం, న్యూ జలపాయ్‌గురి-హౌరా మార్గంలో ఈ ఘటనలు కూడా తరుచు వెలుగుచూస్తున్నాయి. ఈనెలలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో దాడి జరగడం ఇది 24 వ సారి. ఇప్పటివరకు ఒక్క దుండగుడు కూడా దొరకలేదు.
ఇటీవల కాలంలో తెలంగాణ, బిహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్‌లోనూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్వుడు ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఇండియా ఇప్పటికే 14 రూట్లలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. భోపాల్-న్యూఢిల్లీ, చెన్నై-కోయంబత్తూరు, సికింద్రాబాద్-తిరుపతి, అజ్మీర్-ఢిల్లీ కంటోన్మెంట్ రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్‌లో ప్రారంభించారు. మరో 22 కొత్త రూట్ లల్లో మరిని వందే భారత్ రైళ్ళు రాబోతున్నాయి. దీని వెనక ప్రతి పక్షాలు ఉన్నాయి అని అనుకున్నారు. కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు.
అసలు ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? వ్యూహాలు ఏవైనా ఉన్నాయా? అనే సందేహాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ దాడుల వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారు? అనే కోణంలో దర్యాప్తు చేసేందుకు ఇంటలిజన్సు రంగంలోకి దిగి షాకింగ్ వార్త చెప్పింది.
ప్రైవేటు బస్సు యజమానుల పనా?
అవును. ఈ కుట్ర వెనుక ప్రైవేటు బస్సు యజమానుల సంఘం హస్తం ఉన్నదని కేంద్ర ఇంటలిజన్సు విభాగం అనుమానిస్తోంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఈ అనుమానాలను నమ్మడానికి అవకాశాలు లేకపోలేవు.
వందే భారత్ హై స్పీడ్ రైళ్ళు వచ్చినప్పటినుంచి ప్రైవేటు సూపర్ లగ్జరీ బస్సులకు ప్రయాణికుల తాకిడి బాగా తగ్గింది. దాంతో కొట్లు పోసి కొన్న సూపర్ లగ్జరీ బస్సులు ప్రయాణికులు లేక వెల వెల పోతున్నాయి. భారి నష్టాలు వస్తున్నాయి.
దానితో ప్రైవేటు బస్సు యజమానుల సంఘం రహస్యగా ఈ కుట్ర పన్నినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం బస్సు యజమానులు వందే భాతర్ రైళ్ళ మీద కిరాయి మూకలతో దాడులు చేయించి, వందే భారత్ రైలులో ప్రయాణించడం క్షేమం కాదు అనే పుకార్లు పుట్టించాలని కుట్ర. కొన్ని రైళ్ళను తగులబెట్టించే యోచనలో కూడా ఉన్నట్లు పుకార్లు పుట్టాయి. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలని పోలీసులు కొత్త కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు.