ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు కొనసాగిస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధమున్న వారందరికీ నోటిసులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే బీఎల్ సంతోష్ కు నోటిసులు ఇవ్వగా పరిస్థితులను బట్టి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు కూడా నోటిసులు ఇష్యూ చేసే అవకాశం ఉందని సిట్ సంకేతాలు ఇస్తోంది.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని అమిత్ షా తెరవెనక ఉండి నడిపించినట్లు సిట్ అధికారులు పరోక్షంగా లీక్ చేస్తున్నారు. ఈ డీల్ తో సంబంధం ఉందని అనుమానిస్తోన్న తొమ్మిది మందిపై సిట్ బృందం దృష్టి సారించింది. ఇందులో నోటిసులు పొందిన వారు కాకుండా ఆర్ఎస్ఎస్ కీలక నేత దత్తాత్రేయ హూస్బలె , అమిత్ షా ప్రైవేట్ సెక్రటరీ సాకేత్ కుమార్ ఉన్నారు.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతి కేంద్రంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నడిచిందని.. ఎమ్మెల్యేల కొనుగోలుకు అవసరమైన డబ్బులను దత్తాత్రేయ రెడీ చేసినట్లుగా చెప్తున్నారు. ఈ ఆపరేషన్ కు సంబంధించిన విషయాలను సాకేత్ ద్వారా అమిత్ షా కు రామచంద్ర భారతి చేరవేశారని పోలీసులు అంటున్నారు. షా ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయని, త్వరలో ఆయనకు కూడా నోటిసులు జారీ చేస్తామని సంకేతాలు ఇస్తున్నారు.