నిజం సినిమా డైరెక్టర్ కిషోర్ వెన్నెలకంటితో మా రిపోర్టర్ జరిపిన ఇంటర్వ్యూ మీకు మక్కికి మక్కీగా అందిస్తున్నాము.
రిపోర్టర్: కిషోర్. ఈ నిజం సినిమా ఎందుకు చూడాలి?
కిషోర్ : ఇంతకుముందు మీరెప్పుడూ చూడని రెక్ట్ ఆంగిల్ లవ్ స్టోరి. మీరు ట్రయాంగిల్ లవ్ స్టోరి చూసి వుంటారు. కానీ ఇది రేక్ట్ ఆంగిల్ లవ్ స్టోరి, ప్రేమ దేశం సినిమాతో ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ బయటకు వచ్చాయి. అప్పటివరకు లవ్ స్టోరి అంటే ఏడ్పులు, త్యాగాలు ఉండేవి. కానీ ఈ సినిమా కొత్త కోణంలో వుండటం వల్ల ఆడియన్స్ ఫ్రెష్ గా ఫీల్ అయ్యారు. ఇంకా కొత్తగా ఏం చెప్పగలం. కొత్త కథ ఏం రాయగలం అని అనుకున్నప్పుడు నాకు తట్టిన మొదటి ఆలోచన ఈ ‘నిజం’ కథ.
ఇందులో మీరు రెక్ట్ ఆంగిల్ లవ్ స్టోరి తో పాటు ఒక పొలిటికల్ క్రైం డ్రామా చూస్తారు. లవ్ స్టోరి చుట్టూ ఈ పోలిటికల్ క్రైం స్టోరి బ్యాక్ డ్రాప్ తీసుకున్నాము.
రిపోర్టర్: హిరో, హిరోయిన్స్ గురించి చెప్పండి.
కిషోర్ : ఇందులో ఇద్దరు హీరోలు, ఇద్దరు హిరోయిన్స్ ని కొత్తగా పరిచయం చేశాం. వాళ్ళు నలుగురు కూడా చక్కగ నటించారు. కరణ్ గా ఆర్య, కార్తీక్ గా అరుణ్ నటించారు. కరణ్ మీడియా ఫీల్డ్ నుండి వచ్చారు. కార్తీక్ సాఫ్ట్ వేర్ సైడ్. హిరోయిన్స్ గా చేసిన వాళ్ళల్లో సరిగ్గా నటించిన అమ్మాయి తనిష్క రాజన్ బాంబే నుండి వచ్చారు. సుచి గా చేసిన అమ్మాయి ప్రజ్ఞ మన తెలుగు అమ్మాయి. నలుగురు చాల బాగా చేశారు.
ప్రశ్న: ఈ హిరో హిరోయిన్స్ క్యారెక్టర్స్ ఎలా వుంటాయి.
కిషోర్: క్యారెక్టర్స్ కూడా మీరు గమనిస్తే చాల చిత్రంగా వుంటాయి ఇద్దరు హీరోలు ఇంజినీరింగ్ చదువుతూ వుంటారు ఇద్దరు చదువుల్లోను మిగితా ఆక్టివిటిల్లో పోటీ పడుతుంటారు. కరణ్ కరాటేలో ముందుంటే కార్తీక్ షూటింగ్ లో ముందుంటాడు. ఇద్దరికి గ్యాంగ్ లు వుంటాయి. వీళ్ళు ఎదురు పడితే ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ రన్ అవుతూ వుంటుంది.
మరో పక్క ఇద్దరు హీరోయిన్స్ కూడా చిత్రంగా వుంటారు. సిరి అమాయకురాలు ఐతే సుచి గడుసుది. ఒకరు కన్నీళ్ళు కారిస్తే. ఇంకొకరు కన్నీళ్ళు పెట్టిస్తారు.
కరణ్ అమాయకత్వాన్ని సుచి ఇష్టపడుతుంది, కార్తీక్ హ్యుమర్ చూసి సిరి ఇష్టపడుతుంది. ఐతే ఇక్కడే స్క్రీన్ ప్లే లో మ్యాజిక్ చెయ్యటం జరిగింది.
కార్తిక్ క్యారేక్టర్ సుచి అనే అమ్మాయిని ఇష్టపడి లవ్ ప్రపోస్ చేస్తే, అ అమ్మాయి మాత్రం కరణ్ ని ఇష్టపడుతుంది., అదే విధంగా కరణ్ సిరి అనే అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయి కార్తిక్ ని ఇష్టపడుతుంది ఇలా చాల చిత్రంగా వుంటాయి.
రిపోర్టర్: సీనియర్ ఆక్టర్స్ వున్నారు కదా వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి?
కిషోర్ గారు: కథలో ఆర్ పి (సాయి కుమార్ ) ప్రజల మనిషి ప్రజల మనిషి అంటే తన స్టయిల్ లో అంటే చెడు చేస్తే రౌడి ఇజం అంటాం కాని ప్రజల కోసం చెడ్డవాన్ని నాలుగు తన్ని ఐనా ప్రజలకు మేలు చెయ్యాలి అనుకొనే క్యారేక్టర్. అతన్ని చంపాలి అనుకునే వ్యక్తి పోసాని కృష్ణ మురళి. అయన డి సి పి గా పోలిస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు.
మరో పక్క మాఫియ దగ్గిర నాలుగు వేల కోట్లు తీసుకోని సి ఎం అవ్వలేక హోం మినిస్టర్ గా మిగిలిపోయిన పాత్రలో నాగ బాబు చేశారు.
రిపోర్టర్: నిజం అని టైటిల్ పెట్టటానికి రీజన్ ఏంటి?
కిషోర్ : మహేష్ బాబు చేశారు అని కాదు. ఈ కథలో నిజం తెలియకుండా కొన్ని క్యారెక్టర్స్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాయి. వాళ్ళు అలా తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం వల్ల జరిగిన పరిణామాలు ఏంటి అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది.
రిపోర్టర్: నిజం సినిమాలో సీనియర్ నటులతో చేశారు కదా? ఆ ఎక్స్పిరియన్స్ ఎలా వుంది?
కిషోర్ : చాలామంచి అనుభవం. అది నాకు సాయికుమార్ అన్నయ్య చెన్నై లో ఉన్నప్పటి నుండే పరిచయం. కథ తీసుకోని వెళ్లి అన్నయ్య నేను డైరెక్టర్ అవుతున్న మీరు ఈ క్యారేక్టర్ చెయ్యాలి అని కథ చెప్పగానే తప్పకుండా చేస్తా అని చెపారు అయన. సాయికుమార్ అనగానే పెద్ద డైలాగ్స్ అగ్రెసివ్ ఆక్టింగ్ గుర్థుకువస్తుంది. కానీ ఇందులో చాలా సేటిల్ద్ గా అయన ఆక్టింగ్ వుంటుంది. గాడ్ ఫాథర్ సినిమాలో చిరంజీవిలా సైలెంట్ గా వుంటూ తన పని తానూ చేసుకుంటూ పోతు వుంటారు. కొన్ని సజిషన్స్ షాట్స్ కి భుజం ఇవ్వాల్సి వస్తే డూప్ పెట్టి చేస్తాం. కానీ అన్నయ్య కారవాన్ లో రెస్ట్ తీసుకోకుండా ఆయనే వుంది చేశారు. చాలా కంఫర్ట్ ఇచ్చారు. కొత్త డైరెక్టర్ కి అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఆయనకు లేకపోయినా, నాకు అంత కంఫర్ట్ ఇచ్చారు. ఆ విషయంలో అన్నయ్యని ఎంత పొగిడినా తక్కువే. ఓవర్ అని కాదు కానీ అయన కొడుకు ఆదిని ఎలా చుసుకుంటారో ఎంత సపోర్ట్ చేస్తారో నన్ను అంతే సపోర్ట్ చేశారు.
ఇక పోసాని ఎంత పెద్ద రైటర్ అనే విషయం అందరికి తెలిసిందే. అయనకి కథ బాగా నచ్చి తప్పకుండా ఈ సినిమా హిట్ సినిమా అని ఒక రోజు ఒక్క షాట్ వుంటే, షాట్ సీన్ కాదు… ఒక్క షాట్ కోసం లొకేషన్ కి వచ్చి సాయంత్రం వరకు ఎదురు చూసి ఆ షాట్ లో కనిపించి వెళ్లారు.
మన మెగా బ్రదర్ నాగబాబు ఎంత బిజీగా వున్నారో తెలిసిందే. అయన కూడా ఎప్పుడు డేట్స్ అడిగినా పోస్ట్ పోన్ చెయ్యకుండా హెల్ప్ చేశారు. అసలు వీళ్ళ కాంబినేషన్స్ సెట్ చెయ్యటం చాల కష్టం అన్నారు. కానీ మరి నాకెందుకో కష్టం అవ్వలేదు నాకోసమే డేట్స్ రెడి చేసి పెట్టినట్టు నేను ఎప్పుడు చేద్దాం అని షెడ్యూల్ వేసుకున్నా సహకరించారు. సరదాగా సాగిపోయింది షూట్ అంతా. ఇప్పటికి మెస్సేజ్ చేస్తుంటారు. తమ్ముడు ఎప్పుడు రిలీజ్ ప్లాన్ చేస్తున్నావ్ అని. దేవుడి దయవల్ల ఆ సమయం కూడా త్వరలోనే రావాలి ఇప్పటికి కన్నడ, హిందీ రైట్స్ మంచి బిజినెస్ ప్రపోసల్స్ వున్నాయి. ఒటిటి రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. సెన్సార్ పనులు కూడా అయ్యాయి.
నిర్మాత జానకిరామరావు, పామరాజు పెద్దఎత్తున ప్లాన్ చేస్తున్నారు. చాలా పాజిటివ్ టాక్ నడుస్తుంది ఇండస్ట్రిలో కూడా సంతోషంగా వుంది.
రిపోర్టర్: టేక్నిషన్స్ గురించి చెప్పండి.
కిశోర్ : ఈ నిజం సినిమాకి సంగీతం సి. కృష్ణ, డీఓపీ జి వి ప్రసాద్, ఎడిటర్ జేపీ, అసోసియేట్ ఎడిటర్ రత్నం, యం రాజు, లిరిక్స్ సురేష్ గంగుల, మాటలు వి.వి కమల్, డాన్స్ చంద్రకిరణ్, భాను, నిర్మాతః జానకిరామారావు, పామరాజు, కథ కధనం మరియు డైరెక్షన్ కిషోర్ వెన్నెలకంటి. అంటే నేనే.