”నాపేరు రికార్డ్ లల్లో ఉడడం కాదు – నా పేరు మీదనే రికార్డ్ లు ఉంటాయి” అనే డైలాగ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చెపితే విజిల్స్ పడ్డాయి.
ఇప్పుడు దానిని నాని నిజం చేస్తున్నారు నాని. ‘దసరా’ సరికొత్త రికార్డులు సృస్తిస్తోంది. నేచురల్ స్టార్ గా పేరు పొందిన నాని నటించిన ‘దసరా’ సినిమా మార్చి 30వ తేదీన గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచి ఈ సినిమా సంచలంగా మారింది. కేవలం రెండు వారాలలోనే రూ 120 కోట్లు సంపాదించింది.
యువ దర్శకుడు శ్రీకాంత్ ఈ సినిమాను అద్బుతంగా చెక్కారు. ఇందులోని ప్రతి పాట ఓ ఆణిముత్యంలా ప్రజాదరణ పొందడం వల్ల కనక వర్షం కురుస్తోంది. ప్రతి రోజు ‘దసరా’ పండగ చూపిస్తోంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మొత్తంగా 120 కోట్లకు పైగా కలెక్షన్స్ రావడం కొత్త రికార్డ్. లాంగ్ రన్ లో రూ. 200 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యం లేదు.
మొదటి షో కాగానే మేము ఈ సినిమా సమీక్ష రాయించాము. అందులో రచయిత దురికి మోహన రావు రాశారు ఓ మంచి మాట రాశాడు. ఆరోజుల్లో చిన్న హీరోగా ఉన్న చిరంజీవి కి ‘ఖైదీ’ సినిమా బ్రేక్ ఇచ్చి మేఘా స్టార్ ని చేసింది. అలాగే మిడిల్ రేంజ్ హీరోగా ఉన్న నానికి ‘దసరా’ సినిమా మేఘా స్టార్ ని చేస్తుంది” అని చెప్పారు. ఇప్పుడు అదే నిజమయ్యింది. ఇప్పుడు నాని మేఘా స్టార్ రేంజ్. రేమునరేషన్ అమాంతం నాలుగు రెట్లు పెంచారు. తప్పులేదు. ఇది వ్యాపారం.
ఇక రెండు వారాల్లో ఈ సినిమా కొత్త రికార్డుల మోత ఎలా మోగిస్తోంది? ఇంతకు మించిన కలక్షన్ సినిమాలు ఉన్నాయిగా? అనే సందేహం మీకు రావచ్చు. ఎందుకంటే ఐపిఎల్ క్రికెట్ జరిగే 55 రోజులు భారత దేశంలోని అన్ని భాషల సినిమాలకు శాపం లాంటిది. కలక్షన్లు అస్సలు ఉండవు. ఎంత గొప్ప సినిమాకైనా 40 శాతం మాత్రమే ఉంటాయి.
అందుకే ఈ సీజన్ లో నిర్మాతలు పెద్ద సినిమాలను విడుదల చేయరు. అయినా ‘దసరా’ నిర్మాత సుధాకర్ చెరుకూరి గుండె నిబ్బెరంతో సినిమాను విడుదల చేశారు. ఈ సినిమా మీద ఐపిఎల్ క్రికెట్ ప్రభావం ఏమాత్రం పడలేదు. గత పదేళ్లుగా చూస్తే ఐపిఎల్ క్రికెట్ జరిగే సీజన్లో ఇలాంటి కలెక్షన్లు ఏ భారతీయ సినిమాకు లేవు. కాబట్టి ఇవి రికార్డ్ బ్రేక్ కలేక్షలు అని భావించవచ్చు.
పక్కా తెలంగాణ నేపద్యంలో వచ్చిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్తో కలిపి మొత్తంగా రెండు వారాలకు రూ. 43.31 కోట్ల షేర్ కలెక్షన్స్ రాగా ఇందులో 72.95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
బెంగుళూరు, కర్ణాటక లాంటి అల్ ఇండియాలో రూ. 7.62 కోట్ల వరకు వచ్చాయి. ఫ్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే తమిళ్ మలయాళం కూడా ఈ సినిమాను సింపుల్వి గా డుదల చేశారు. ఎలాంటి హంగామా చేయలేదు. అయినా ఆ భాషల్లో మొత్తంగా 1.52 కోట్లు షేర్ వచ్చింది. ఈ సినిమా రేంజ్ కి ఇది కూడా గొప్ప కలెక్షన్లే. తమిళ సినిమాలు ౩౦ శాతం కలేక్షలు లేక వెలవెల పోతున్నాయి. కానీ ఈ డబ్బింగ్ సినిమా దుమ్ము రేపింది.
ఇక ఓవర్సీస్ లో ఏకంగా రూ. 10.42 కోట్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 14 రోజుల్లో దసరా సినిమా రూ. 80.82 కోట్ల షేర్. మొత్తం కలెక్షన్స్ రూ 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక దసరా సినిమా ఓవరాల్ గా రూ. 48 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. ఇక రూ. 69 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో వచ్చిన ఈ సినిమా మొత్తంగా ఇప్పటివరకు రూ. 120.82 కోట్ల రేంజ్ లో లాభాలు అందుకుంది. రోజు రోజుకు దీని రేంజ్ పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. ఇది ఖచితంగా నిర్మాత సుధాకర్ చెరుకూరి సినిమా. అతనిని బంగారు భవిష్యత్తు ఉంది.