1976 లో అమితాబ్, రాఖి, శశి కపూర్ నటించిన ‘కబి కబి’ సినిమాలోని ‘కబి కబి మేరే దిల్ మే కయాలు ఆతి హై’ పాట మీకు గుర్తుందా? గుర్తులేదా? శశి కపూర్ శోభనం గదిలో రాఖి నగలు ఒకొక్కటిగా ఒలుస్తూ ఉంటాడు. తర్వాత ఆమె ముసుకు తీసి ఆమె చేతులు పిసుకుతారు. ఇప్పుడు గుర్తుకు వచ్చిందన్నమాట! అప్పట్లో ఆ పాట దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. తొలిసారి శోభనం సీన్ చూపడం, ఆమె నగలు మెల్లిగా తొలగించి నందుకే ఆ సినిమాను బ్యాన్ చేయలని పార్లమెంట్ దద్దరిల్లిది. సెన్సార్ వాళ్ళను సస్పెండ్ చేశారు.
అది సినిమా కాబట్టి సరిపోయింది. సరిగ్గా ఇప్పుడు అలాంటి శోభనం సీన్ సోషల్ మీడియాలో సంచలం రేపుతోందో. సోషల్ మీడియా అనేది ఇప్పుడు సెల్ ఫోన్ లో ఇమిడిపోయిన ప్రపంచం. పుట్టిన రోజులు మొదలుకొని గిట్టిన రోజుల విడియోలను ఎలాంటి సెన్సార్ లేకుండానే పెట్టుకోవచ్చు. ఎంతమంది వ్యూస్ చూస్తే అంత గొప్ప. ఎంతమంది లైక్ లు కొడితే అంత ఆనందం. ఎంతమంది షేర్ చేస్తే అంత గర్వం.
కత్తిని కూరగాయలు కోయడానికి వాడుకోవచ్చు, పీకలు కోయడానికి కూడా వాడుకోవచ్చు. అలాగే సోషల్ మీడియాను కూడా రెండు రకాలుగా వాడుకుంటున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సింది వచ్చింది అంటే – పెళ్లిని పది మందిలో చేసుకుంటారు. కానీ శోభనం మాత్రం రహస్యంగా చేసుకుంటారు. ఆల్ట్రా మోడరన్ దేశాల్లో కూడా ఇదే పద్దతి పాటిస్తారు.
కానీ మన దేశానికి చెందిన ఓ కొత్త జంట అందరి సమక్షంలో సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నారు. అందరి సమక్షంలో శోభనం చేసుకోవాలి అనే కొత్త ఆలోచన వచ్చింది. అందులో సిగ్గుపడేది ఏముంది అనుకున్నారు. అందరికి తెలిసిందే కదా! ఎవరికీ తెలియని రహస్యం ఇది అనుకున్నారు. పెళ్ళికి పిలిచినట్లే శోభనానికి అందరిని పిలిచారు. అందరు జడుసుకుని రాలేదు. ఎవ్వరు రాలేదు. అయితే మాత్రం ఊరుకుంటారా? చేతిలో సెల్ ఫోన్లు ఎలాగో ఉన్నాయి. వాటిని శోభనం గదిలో పెట్టి తమ శోభనం షూట్ చేశారు.
అక్కడితో ఆగక ‘నా శోభనం ఎంత గ్రాండ్ గా జరిగిందో చూడండి’ అని ఆ పెళ్లి కూతురు సోషల్ మీడియాలో పెట్టింది. పెళ్ళికొడుకు కూడా తమ స్నేహితులకు ఆ విడియోని షేర్ చేశాడు. ఇది చూసిన సభ్యసమాజం సిగ్గుతో తల వంచుకుంటోంది. వెర్రి తలలు వేస్తున్న యువత ఆలోచనలు మన సంప్రదాయాలను అబాసుపాలు చేస్తున్నాయి.
anything for clout huh pic.twitter.com/fmqvvDIWKJ
— shay (@shayararar) February 3, 2023