కాలం వేగంగా పరుగెడుతున్న కొద్ది మనుషుల ఆలోచనల సరళి కూడా మారుతోంది. వివాహన్ని పక్కకు పెట్టేసి సహజీవనం చేయాలనే ఆలోచన చేస్తోంది నేటి యువత. దీని వలన కొంత మంచి జరగడంతోపాటు అనేక దారుణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వివిధ దేశాలు చట్ట సవరణలు చేస్తున్నాయి. వివాహేతర సంబంధాలు, సహజీవనం వంటి అంశాలపై భారత సర్వోన్నత న్యాయస్థానం గతంలో సంచలన తీర్పులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో కొన్నింటిని నేరంగా పరిగణించలేమని అభిప్రాయపడింది.
అయితే, సహజీవనం, వివాహేతర సంబంధాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాటిని నేరంగా పరిగణిస్తూ చట్ట సవరణ చేసింది. అయితే, ఈ నిర్ణయం తీసుకున్నది భారత్ కాదు ఇండోనేషియా ప్రభుత్వం. వివాహేతర సంబంధాలు, సహజీవనం వంటి విషయాలపై కఠిన నిర్ణయం తీసుకుంది. ఇకపై వాటిని నేరంగా పరిగణిస్తూ చట్టంలో మార్పులు చేసింది. ఇండోనేషియా నేర శిక్షాస్మృతికి చట్ట సవరణ చేసిన బిల్లును మంగళవారం అక్కడి పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది.
Also Read : అషూ , ఆర్జీవీల బోల్డ్ ఇంటర్వ్యూ – సె* 10నిమిషాల్లో చేసేస్తారంటూ..!
ఈ నూతన చట్ట సవరణ ప్రకారం..స్త్రీ , పురుషుల్లో ఎవరైనా వివాహేతర సంబంధం పెట్టుకుంటే నేరంగా పరిగణించబడుతుంది. అదేకాక, ఈనేరం చేసినందుకు ఏడాదికాలం శిక్ష కూడా విధిస్తారు. ఇక, ఎవరైనా సహజీవనం చేసినట్టు తేలితే వారికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు. ఇది , ఇండోనేషియా పౌరులకే కాకుండా పర్యాటకులకు కూడా ఈ చట్టం వర్తించనుంది.
ఇవే కాకుండా ఇండోనేషియా ప్రభుత్వం మరికొన్ని అంశాలపై మార్పులు చేసింది. దైవ దూషణ, అబార్షన్ లు నేరంగా పరిగణిస్తారు. అంతేకాకుండా , దేశ అద్యక్షుడు, ప్రభుత్వ ఆఫీసర్లను, సంస్థలను విమర్శించడాన్ని కూడా నేరంగా పరిగణిస్తారు. కాగా, ఇండోనేషియా సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.
భావ ప్రకటన స్వేచ్చకు విఘాంతం కల్గించేలా చట్ట సవరణ జరిగిందని హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు.