సూపర్ స్టార్ కృష్ణ పార్ధివ దేహం వద్ద పవిత్ర , నరేష్ ల వ్యవహారశైలి చూసిన పలువురు సినీ ప్రముఖులు ఆశ్చర్యపోయారు. ఇద్దరు జంటగా రావడం.. పదేపదేనరేష్ చేతిపట్టుకొని పవిత్ర అటు, ఇటు తిరగడం వంటి దృశ్యాలను చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. కృష్ణ భౌతికకాయం ఉంచిన పద్మాలయ స్టూడియోస్ వద్ద వారి వ్యవహారశైలి జుగుప్సాకరంగా ఉందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
కార్డియాక్ అరెస్ట్ తో కృష్ణను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్చగానే ఆసుపత్రికి పవిత్ర, నరేష్ లు కలిసే వచ్చారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించిన తరువాత ఆయన భౌతిక కాయాన్ని ఉంచిన పద్మాలయ స్టూడియోకు పవిత్రను నరేష్ వెంట పెట్టుకొని వచ్చారు. ఇద్దరు అక్కడ సందడి చేశారు. నరేష్ మూడో భార్య కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించి వెళ్ళిన వెంటనే పవిత్ర లోకేష్ ను నరేష్ తీసుకువచ్చారు. ఇద్దరు అన్యోన్యంగా కలిసి రావడం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. చిటికి మాటికి పవిత్ర భుజంపై చేయేస్తూ నరేష్ కలియతిరగడం చూసి అంత అసహించుకున్నారు.
పద్మాలయ స్టూడియో వద్ద పవిత్ర , నరేష్ ల చేష్టలు వెగటు పుట్టించాయని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అమ్మా పవిత్ర…ఇలా దిగజారవెంటమ్మా అంటూ మండిపడుతున్నారు. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న నరేష్ కు ఇంకా సిగ్గు రాలేదు.. నాన్న భౌతిక కాయం ముగింటే సరసాలు ఆడటానికి సిగ్గనిపించడం లేదా , మీ సరసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందంటూ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు నెటిజన్లు. మూడో భార్యతో విడాకుల ఇష్యూ కొనసాగుతుండగానే.. పవిత్రతో సహజీవనం చేస్తూ సభ్య సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నావ్ నరేష్ అంటూ ఎకిపారేస్తున్నారు.
మళ్ళీ ఒకటవనున్న నాగ చైతన్య – సమంత..?