జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలన్న సంగతి తెలిసిందే. మనుషుల వలన మూగ జీవాలకు ఎలాంటి హనీ జరిగిన వెంటనే ఆమె రెస్పాండ్ అవుతుంది. మనుషుల వలన జంతువులకు హనీ కలగకూడదని మాంసాహారమే కాదు పాలు, పాల పదార్థాలు, బై ప్రొడక్ట్స్ కూడా రష్మీ మానేసిందట.
మూగ జీవాల సంరక్షణ కోసం సోషల్ మీడియా వేదికగా ఉద్యమం నడుపుతోంది రష్మీ. జంతువులకు హనీ జరిగినట్లు తన దృష్టికి వస్తే అధికారులకు ఫిర్యాదు చేసి యానిమల్స్ పై తన ప్రేమను చాటుకుంటుంది. ఇక.. సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జంతు వధ జరిగింది. కోడి పందెంల వలన పలు చోట్ల కోళ్ళు గాయపడ్డాయి. దీంతో ఈ కోడి పందాలపై రష్మీ రియాక్ట్ అయింది.
ఓ వ్యక్తి కోడి పందెంలో గెల్చినట్లు తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఈ విషయాన్ని తప్పుబట్టిన రష్మీ.. హింసను ప్రమోట్ చేస్తున్నారంటూ మండిపడింది. అయితే ఈ పోస్ట్ మిక్స్డ్ ఒపీనియన్స్ కి దారి తీసింది. కొందరు ఆమెను సమర్ధించగా మరికొంతమంది విమర్శించారు. తమిళనాడులో జల్లికట్టు కూడా వైలెన్సే, వెళ్లి వాళ్లకు చెప్పు. చెప్పుతో కొడతారని ఒకరు కామెంట్ చేశారు.
మరొక నెటిజెన్ మాత్రం పోస్టుకు అస్సలు సంబంధం లేకుండా కామెంట్స్ చేశాడు. నువ్వు నీ పతి వ్రత కథలు….నువ్వు చేసే ఎక్స్పోజింగ్ గురుంచి చెప్పు బేబీ. దాంతో ఎంత మంది యువత హృదయాలు దెబ్బ తింటున్నాయో నీకు తెలుసా.. నువ్వు చేసేది కూడా వైలేన్సే అంటూ పేర్కొన్నాడు.
నువ్వు నీ పతి వ్రత కథలు….నువ్వు చేసే ఎక్స్పోజింగ్ గురుంచి చెప్పు బేబీ,అది ఎంత మంది యువత హృదయాలు దెబ్బ తింటున్నయు 😆😆😆😆
— satish…k (@ksatishkumar555) January 15, 2023