తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం ఫోకస్ పెట్టింది. నార్త్ లో బలంగా ఉన్నా సౌత్ లోనూ సత్తా చాటాలని బీజేపీ ఉవ్విల్లురూతోంది. ఇందుకు తెలంగాణ గేట్ వే అవుతుందని భావిస్తోన్న ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే ఎన్నికల్లో పాలమూరు నుంచి బరిలో నిలిచే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు కమలం కాంపౌండ్ లో చర్చ జరుగుతోంది.
దక్షిణాదిలో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే అభివృద్ధి కార్యక్రమాలను స్పీడప్ చేస్తోంది. ప్రధాని మోడీ వచ్చి డెవలప్ పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. గతంలో తమిళనాడుపై ఫోకస్ చేయగా తాజాగా తెలంగాణపై గట్టి ఫోకస్ చేస్తోంది. సౌత్ లో బలపడెందుకు తెలంగాణ ప్రవేశ ద్వారం అవుతుందని కమలనాథులు భావిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణలోని మహబూబ్ నగర్ స్థానం నుంచి ప్రధాని పోటీ చేస్తే ఉపయుక్తంగా ఉంటుందన్న అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నారట.
మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి వాజ్ పేయ్ హయంలో (1999-2004)జితేందర్ రెడ్డి బీజేపీ టికెట్ మీద గెలిచారు. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి 2014 లో ఎన్నం శ్రీనివాస్ రెడ్డి బీజేపీ తరుఫున గెలిచారు. డీకే అరుణ బీజేపీలో చేరాక మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీకి కాస్త పట్టు పెరిగింది. దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మహబూ నగర్ నుంచి మోడీ పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. దక్షిణాది నుంచి మోడీ పోటీ చేయాలనే చర్చ పార్టీలో జరిగినప్పుడు తెలంగాణ , తమిళనాడు రాష్ట్రాలు ప్రస్తావనకు వచ్చాయి. తెలంగాణను కాదనుకుంటే రామనాథపురం ఉండొచ్చని అంటున్నారు.