టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడంతో ఆ పార్టీ భవిష్యత్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. యువ గళం పేరిట పాదయాత్ర చేస్తోన్న లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుండటంతో టీడీపీని నడిపించే సారధి ఎవరు అన్నది బిగ్ క్వశ్చన్ గా మారింది. ఎన్నికల వరకు చంద్రబాబు, లోకేష్ లను జైలు గోడలకు పరిమితం చేయాలని వైసీపీ కుట్రలు చేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీని నందమూరి ఫ్యామిలీ లీడ్ చేస్తుందా..? అనే సందేశాలు వస్తున్నాయి.
టీడీపీ భవిష్యత్ పై చర్చోపచర్చలు జరుగుతున్న వేళ ఆ పార్టీ నేతలతో నారా భువనేశ్వరి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జరుగుతున్న పరిణామాలను అంచనా వేసి భువనేశ్వరి రంగంలోకి దిగుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే ఆమె పార్టీ నేతలతో భేటీ అవుతున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో ఎవరూ అధైర్యపడవద్దని .. తాను ఉన్నానని బాలకృష్ణ స్పష్టం చేశారు. బస్సు యాత్ర కూడా చేపడుతానన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబుతో భేటీ అయిన భువనేశ్వరి ఆ మరుసటి రోజే పార్టీ నేతలతో సమావేశం కావడంతో ఇంట్రెస్టింగ్ గా మారింది.
పార్టీకి అన్ని తానై వ్యవహరించిన బాబు అరెస్ట్ తో ఎవరూ అధైర్యపడవద్దని.. లోకేష్ ను అరెస్ట్ చేసినా ఎవరూ ధైర్యం కోల్పోవద్దని.. పార్టీని ముందుకు తీసుకు వెళ్లేందుకు తానునని అభయం ఇచ్చేందుకు నారా భువనేశ్వరి రెడీ అయ్యారన్న సంకేతాలు వస్తున్నాయి. గతంలో జగన్ అరెస్ట్ సమయంలో వైసీపీకి షర్మిల, విజయమ్మ అన్ని తానై వ్యవహరించారు. ఇప్పుడు టీడీపీకి చంద్రబాబు కోడలు బ్రాహ్మణి, ఆయన భార్య నారా భువనేశ్వరిలు పార్టీ బాధ్యతను తీసుకోనున్నారని టాక్ నడుస్తోంది.
మరోవైపు.. చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు స్పందించకపోవడం తెలుగు తమ్ముళ్ళను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. పార్టీ పట్టించుకోకపోవడంతోనే ఎన్టీఆర్ ఈ అంశంపై స్పందించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో పార్టీని జూనియర్ ఎన్టీఆర్ , లోకేష్ లు ఉమ్మడిగా ముందుండి పార్టీని నడిపించాలని పార్టీ అభిమానులు కోరుతున్నారు.
Also Read : ఏపీ అసెంబ్లీ రద్దు – జగన్ సంచలన నిర్ణయం..?