ఏపీతో పోలిస్తే తెలంగాణలో భూముల రేట్లు అధికంగా ఉన్నాయని కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. ఇటీవల టీడీపీ అధినేత కూడా అదే మాట అన్నారు. ఏపీ కన్నా తెలంగాణ అభివృద్ధిలో పరుగులు పెడుతుందని ప్రశంసించారు. కాని చంద్రబాబు చేసిన ఈ కామెంట్స్ పింక్ మీడియాకు బూతుల్లాగా కనిపించాయి. చంద్రబాబు వ్యాఖ్యల్లో అక్కసు వెళ్ళగక్కినట్లు అనిపించాయి.
ఒకప్పుడు ఏపీలో భూమి అమ్మితే తెలంగాణలో నాలుగెకరాలు కొనుగోలు చేసేవారు. ఇప్పుడు మాత్రం హైదరాబాద్ చుట్టూపక్కల ఏరియాలో భూమిని కొనుగోలు చేయాలంటే ఏపీలో మూడెకరాల భూమిని అమ్మేయాల్సిన పరిస్థితి ఉందని కేసీఆర్ ఆ మధ్య ప్రతి సభలో చెప్పేవారు. ఇదే మాటను కాస్త అటు, ఇటుగా చంద్రబాబు అనేసరికి బీఆర్ఎస్ కరపత్రమైన పత్రికలో “తకరారు బాబు ఎకరాల ఏడుపు” అనే హెడ్డింగ్ తో పెద్ద కథనమే రాశారు. మళ్ళీ చంద్రబాబు తెలంగాణపై కుట్రలు చేస్తున్నాడని.. అందుకే ఈ ప్రశంసలు అని పేర్కొన్నారు. మెచ్చుకోవడం కూడా కరిచెందుకేనని కథనం రాసేశారు.
రెచ్చగొట్టేందుకే చంద్రబాబు తెలంగాణపై ప్రశంసలు కురిపిస్తున్నారని ఆ కథనంలో రాసుకొచ్చారు. నిజంగా రెచ్చగొట్టాలనుకుంటే విమర్శిస్తారు కానీ ఎందుకు ప్రశంసలు కురిపిస్తారో..? ఆ కథనం ప్రచురించిన జర్నలిస్టుకే తెలియాలి. చంద్రబాబు ఏం మాట్లాడినా తెలంగాణకు వ్యతిరేకమే అనేలా ప్రచారం చేస్తున్నారు. నిజంగా ఆయన మరోలా కామెంట్స్ చేసి ఉంటే తప్పు పట్టొచ్చు కానీ కేసీఆర్ అన్న వ్యాఖ్యలను అంటే తప్పుబట్టడం ఏంటో ఆ పత్రిక యాజమాన్యంకే తెలియాలి.
Also Read :