అధికార పార్టీలో టికెట్ లభించకపోతే రాజీనామా చేసి.. ప్రత్యామ్నాయ పార్టీలో చేరడం కామన్. కాని, టికెట్ లభించాక కూడా అధికార పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారంటే ఆ పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్నట్లే. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే. మాల్కజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు ప్రకటించి బిగ్ షాక్ ఇచ్చారు.
తన కుమారుడికి టికెట్ నిరాకరించడంతోనే బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ లో రెండు టికెట్లు ఇస్తామని హామీ లభించడంతో మైనంపల్లి బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మైనంపల్లి చాలా బలమైన నేత. అందుకే హరీష్ రావుపైనే తీవ్ర విమర్శలు చేసినా మైనంపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు కేసీఆర్. కుమారుడికి టికెట్ ఇవ్వకపోయినా అతని రాజకీయ భవిష్యత్ కు తమది బాధ్యత అని ప్రభుత్వ పెద్దలు చెప్పినా మైనంపల్లి పట్టించుకోలేదు.
బీఆర్ఎస్ లో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినా ఎందుకో మైనంపల్లి హన్మంతరావుకు నమ్మకం కలగలేదు. అందుకే బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు వీడియోను రిలీజ్ చేశారు. ఏ పార్టీలో చేరబోయేది కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అనౌన్స్ చేశారు. ఇద్దరికీ టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ నుంచి హామీ లభించడంతోనే ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు కనబడుతోంది.
ఏదీ ఏమైనా మైనంపల్లి బీఆర్ఎస్ కు రాజీనామా చేయడం బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బే. ఓ ఎమ్మెల్యే.. అందులోనూ టికెట్ లభించాక కూడా పార్టీని వీడారంటే ఆ పార్టీపై జనాల్లోనూ నమ్మకం సడలుతుంది. పైకి ఆయన ఏ కారణం చెప్పినప్పటికీ.. బీఆర్ఎస్ గెలిచే పార్టీ అని సొంత ఎమ్మెల్యేలు సైతం నమ్మడం లేదన్న అభిప్రాయం మైనంపల్లి రాజీనామా ఎపిసోడ్ తో బలపడుతుంది.
Also Read : త్వరలో నలుగురు మాజీ ఎంపీలు , ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి -సీక్రెట్ భేటీ అందుకే..?