మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు అయినట్లు సమాచారం. మైనంపల్లితోపాటు ఆయన కుమారుడు రోహిత్ రావుకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించడంతో వారిద్దరూ హస్తం గూటికి చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 17న తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో సోనియా గాంధీ సమక్షంలో వీరు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
మెదక్ అసెంబ్లీ సీటు తన కుమారిడికి బీఆర్ఎస్ నిరాకరించడంతో మైనంపల్లి పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను పార్టీలో చేర్చుకునే దిశగా కాంగ్రెస్ తోపాటు బీజేపీ కూడా చర్చలు జరిపాయి. మైనంపల్లి కుటుంబంలో ఇద్దరికీ టికెట్లు ఇచ్చేందుకు బీజేపీ కూడా అంగీకరించింది. కానీ మెదక్ లో కాంగ్రెస్ కు మాత్రమే స్కోప్ ఉండటంతో మైనంపల్లి హస్తం గూటికి చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు.
రానున్న రెండు రోజుల్లో తన అనుచరులు, కార్యకర్తలతో మైనంపల్లి సమావేశమై కాంగ్రెస్ లో చేరికపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. మైనంపల్లి కాంగ్రెస్ లో చేరుతుండటంతో అక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ ను బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read : బీజేపీలో మళ్ళీ వర్గపోరు – కిషన్ రెడ్డి వర్సెస్ ఈటల..?