ఎన్నో అద్భుతమైన పాటలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు మ్యూజిక్ డైరక్టర్ చక్రి. చాలా తక్కువ కాలంలోనే మ్యూజిక్ డైరక్టర్ స్థాయికి చేరుకున్నాడు. పూరి జగన్నాథ్ రెండో సినిమా బాచి తో మ్యూజిక్ డైరక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన చక్రి ఆ తరువాత వెనుదిరిగి చూసుకొనేలేదు.
బాచి సినిమా ద్వారా చక్రిలోని టాలెంట్ ను ఇండస్ట్రీ గుర్తించింది. దాంతో ఆయనకు వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. రవితేజ హీరోగా నటించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ , అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో వచ్చిన దేశముదురు సినిమాలకు చక్రి సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించాడు.
చక్రి సంగీత దర్శకత్వం వహించిన ఆఖరి సినిమా ‘ వెన్నెల్లో హయ్ హయ్ ‘ 2016లో విడుదలైంది. ఈ సినిమా పాటలకు మంచి స్పందన వచ్చింది కానీ సినిమానే ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆయన అకాల మరణంతో చక్రి కుటుంబం ప్రస్తుతం కొంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.
చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. మా అన్నయ్య బ్రతికి ఉన్నంత కాలం ఆర్థికంగా మేము బాగున్నాము. కానీ ఎప్పుడైతే ఆయన చనిపొయాడో మా కుటుంబం మొత్తం కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఎమోషనల్ అయ్యాడు.
మా వదిన అన్నయ్య ఆస్తిలో సగభాగాన్ని తీసుకొని రెండవ పెళ్లి చేసుకొని అమెరికాలో స్థిరపడిపోయింది. రెండవ భర్తతో కలిసి మా అన్నయ్య ఆస్తిని మంచిగా ఎంజాయ్ చేస్తుంది. కానీ మాకు రావాల్సిన ఆస్తి మాత్రం రాలేదు. ఆ ఇందుకోసం కోర్టులో కేసు వేశాం. మాకు కోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామంటూ చెప్పుకొచ్చారు.
Also Read : అంత మాట అనేశాడా..? దేవి నాగవల్లికి విశ్వక్ సేన్ దారుణమైన కౌంటర్..?