ప్రగతి భవన్ లో అన్ని వ్యవహారాలను చక్కబెట్టే ఎంపీ సంతోష్ రావు నాలుగు రోజులుగా ప్రగతి భవన్ కు రావడం లేదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ప్రగతి భవన్ లో కేసీఆర్ కు మందులిచ్చే దగ్గ నుంచి.. గేట్ లోపలి ఎవరిని అనుమతించాలి..? ఎవరికీ ఎగ్జిట్ బోర్డు పెట్టాలి..? ఇలా అన్ని వ్యవహారాలను సంతోష్ చూసుకుంటాడు. కాని , నాలుగు రోజులుగా ప్రగతి భవన్ లో కనిపించని సంతోష్.. ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసుకోవడంతో ఏం జరిగి ఉంటుందని రాజకీయ వర్గాలు ఆరా తీస్తున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఇటీవల వెన్నమనేని శ్రీనివాస్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈయన సంతోష్ రావుకు అత్యంత సన్నిహితుడు. ఇద్దరు వ్యాపార భాగస్వామ్యులన్న ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలోనే సంతోష్ – శ్రీనివాస్ రావుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల అంశం సంతోష్ రావును కూడా కటకటాల్లోకి నెట్టే అవకాశం ఉందని ఆయన కలవరపడుతున్నారు. ఈ విషయం తెలిసిన కేసీఆర్ కూడా సంతోష్ రావును మందలించారని దాంతో ఆయన మనస్తాపానికి లోనయ్యారని ప్రగతి భవన్ వర్గాలు అంటున్నాయి. తనకు ఏమైనా తన పెదనాన్న చూసుకుంటారన్న ధైర్యంతోనున్న సంతోష్ రావుకు ఈ విషయంలో కేసీఆర్ కూడా తనేమి చేయలేనని చెప్పడంతో ఎం చేయాలో పాలుపోక ప్రగతి భవన్ కు రాకపోకలను రద్దు చేసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సంతోష్ రావుతో టచ్ లోకి వెళ్లేందుకు ఆయన సన్నిహితులు కూడా ప్రయత్నించిన ఫోన్ స్విచ్చాఫ్ వచ్చినట్లుగా చెబుతున్నారు. ఆయన ప్రగతి భవన్ కు వెళ్ళకుండా మరెక్కడికి వెళ్లి ఉంటారని ఆరా తీస్తున్నారు. అసలు హైదరాబాద్ లోనే ఉన్నారా..? మరెక్కడికైనా వెళ్ళారా…? అని ప్రగతి భవన్ వర్గాలు సంతోష్ రావు గురించి అరా తీస్తున్నాయి.