ఏకచిత్ర నటుడని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించడం పట్ల భరత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను తలచుకుంటే వరుసగా పది హిట్ సినిమాలు తీస్తానని.. తన గురించి తక్కువ అంచనా వేయవద్దని స్పష్టం చేశారు. రఘురామకృష్ణంరాజు కామెడి యాక్టర్ కు తక్కువ… పనికిమాలిన యాక్టర్ కు ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు భరత్.
భరత్ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా ఏకచిత్ర నటుడని రఘురామ విమర్శలు చేస్తారు. భరత్ చదువుకోవడానికి అమెరికా వెళ్ళారు. అక్కడ చదువు సరిగా ఒంటబట్టక చదువుకు గుడ్ బై చెప్పేసి ఇండియాకు తిరిగి వచ్చారు. తరువాత సినిమా ప్రయత్నాలు చేశారు. తండ్రి దండిగా సంపాదించి పెట్టడంతో సినిమా హీరో అవ్వాలన్న కోరికను తీర్చుకున్నారు భరత్.
ఓయ్ నిన్నే అనే సినిమాతో హీరోగా పరిచయమైన భరత్ సినీ ఇండస్ట్రీలోపెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. ఆ సినిమా ఉందన్న సంగతి కూడా జనాలకు తెలియదు. మొదటి సినిమా డిజాస్టర్ కావడంతో ఆయనకు ఛాన్స్ లు కూడా రాలేదు. దీంతో తండ్రి డబ్బులు పెట్టడంతో వైసీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అద్రుష్టావశాత్తు ఎంపీ అయ్యారు. హీరో అనే మోజులో పడి భరత్ ఎప్పుడు రీల్స్ చేస్తుంటారని అంటుంటారు. అందుకే ఆయన్ను రీల్స్ ఎంపీ అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు.
ఇప్పుడు తనను ఏక చిత్ర నటుడు అని రఘురామ అనడంపై ఆయనకు కోపం కట్టలు తెంచుకుంది. మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను తలచుకుంటే హీరోగా 10 సినిమాల్లో నటించగలనని, సూపర్ స్టార్ అవ్వగల సత్తా తనకు ఉందని ప్రకటించుకున్నారు.
Also Read : ఎమ్మెల్సీ ఎన్నికల వేళ వైసీపీకి ఎన్నికల సంఘం షాక్