ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని వధువు.. ప్రేమించిన యువకుడితో లేచిపోవడం చూస్తుంటాం. కాని ఈ కేసులో మాత్రం అత్తయ్య అల్లుడితో లేచిపోయి అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేసింది.
విదేశాల్లో ఉండే అల్లుడు ఇటీవల తన భార్యతో కలిసి అత్తింటికి వచ్చాడు. వారి ముగ్గురు పిల్లలను మాత్రం విదేశాల్లోనే ఉంచారు. అల్లుడితో లేచిపోదామనుకున్న అత్త ముందుగానే మంచి స్కెచ్ వేసింది. తన ఇంటికి వచ్చిన అల్లుడికి ప్రత్యేకంగా చికెన్ కర్రీ వండి పెట్టింది. అతని భార్య (తన కూతురు), మామగారు (భర్త)కు మాత్రం మటన్ కర్రీ వండి పెట్టింది. ఆ మటన్ కర్రీలో నిద్రమాత్రలు కలిపింది. అత్త కూడా చికెన్ తింది.
ఇక భోజనం చేశాక కూతురు, భర్త నిద్ర మత్తులోకి జారుకోగా.. అల్లుడితో కలిసి అత్త విదేశాలకు వెళ్ళిపోయింది. అత్త- అల్లుడి మధ్య 13ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఇక, సాయంత్రం అయ్యాక నిద్రమత్తు నుంచి తెరుకున్నా భర్తకి, కూతురికు ఆసలెం జరిగిందో తెలియకుండా పోయింది.
తన భార్య, అల్లుడు అదృశ్యమయ్యారని రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలిసులు దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. అత్త -అల్లుడు ప్రేమాయణం కొనసాగిస్తున్నారని తెలిసి అవాక్కయ్యారు. తమకు తెలియకుండా ఈ లవ్ స్టొరీ నడిచిందా అని రమేష్ మరియు అతని కూతురు ఆశ్చర్యపోయారు.
పెళ్లి తరువాత కూతురితో కలిసి అల్లుడు తరుచుగా ఇంటికి వచ్చేవాడు. కొన్నాళ్ళయాక భార్యను విదేశాలకు తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే , వారిద్దరి మధ్య విదేశాలకు వెళ్లకముందే అనైతిక సంబంధం ఏర్పడి ఉండొచ్చునని తెలుస్తోంది. గతేడాది డిసెంబర్ 30 చివరిగా అత్తారింటికి భార్యతో వచ్చాడు. ఆ తర్వాత ఈ డ్రామా నడిచింది.
రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనదర పోలీసులు కేసు నమోదు చేశారు. నారాయణన్‌ను విదేశాల నుంచి భారత్‌కి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అతను ఇండియా వచ్చాక అతనికీ, అత్తగారికీ కౌన్సెలింగ్ ఇస్తామని అంటున్నారు.
Also Read : బాలికపై కీచక టీచర్ అత్యాచారం – బలవంతంగా తాళికట్టి..!