బిజెపి ఉనికిలేని రాష్ట్రాలల్లో ప్రభుత్వ సంస్థలను అమ్మి, నాలుగు డబ్బులు పోగుచేయాలన్నది బిజెపి కుట్ర. ఆ డబ్బును బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో దారాదత్తం చేయాలన్నది మోడీ మరో కుట్ర. దీనిని ఆరేళ్లుగా ఆమము చేస్తున్నారు.
బిజెపి ఉనికిలేని రాష్ట్రాలల్లో తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో స్టానంలో ఉంది. అక్కడ బిజెపికి ఎలాంటి భవిష్యత్తు లేదని తేలిపోయింది. అందుకే విశాక ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టారు మోడీ. అందుకే మార్చ్ 27 వ తేదినా ఈఓజి (ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన) విడుదల చేసింది బిజెపి సర్కార్.
దానిని అందరు ఒక్క గొంతుకతో వ్యతిరేకించినా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం నోరు విప్పలేదు. ఎందుకంటే ఓసారి జైలు జీవితం గడిపి, చిప్ప కూడు తిన్న జగన్ ఇప్పుడు ‘పప్పు’ కూడు తింటున్నారు. అందుకే ‘పప్పు సిఎం’ గా మారారు. మోడీతో అతనికి చీకటి ఒప్పందాలు కుదిరాయి అన్నది అందరికీ తెలుసు.
అందుకే జగన్ ప్రతిదానికి వంటపాడుతూ మోడీకి చెక్క భజన చేస్తున్నారు. ఇప్పుడు ఏమాత్రం మోడీకి ఎదురుతిరిగినా మరో సారి చిప్ప కూడు తప్పేలా లేదు. కెలికి వాసన చూసుకోవడమే. ఈడి దాడులు చేయవచ్చు. సిఐడి పాత కేసులు తోడవచ్చు. కోర్టులో నిదపోతున్న కేసులు మేలుకోనవచ్చు. ఇవన్ని మోడీ కనుసన్నల్లో ఉన్నవే.
ఇక అన్నీ తల నొప్పులే. ప్రజల కోసం జైలుకు వెళ్ళడం అవసరమా? ప్రజల కోసం రిస్క్ తీసుకుని మోడీతో తల కొరివి పెట్టుకోవడం అవసరమా? ‘విశాక ఉక్కు – ఆంధ్రుల హక్కు’ ప్రజల నినాదం. కానీ జగన్ నినాదం కాదుగా?కాబట్టి సైలెంట్ గా తన పని తాను చూసుకుంటూ నాల్గు రాళ్ళు వెంకేసుకున్తున్నారు.
బిజెపి తో పొత్తు పెట్టుకునే పనిలో అటు చంద్రబాబు నాయుడు, ఇటు జనసేన ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా మోడీ చొక్కపట్టి నిలదీసే పరిసతిని లేదిప్పుడు. ప్రజల మెప్పుకోసం హడావుడి చేసినా ఉద్యమం చేసి దానిని అడ్డుకునే కసితో, నిజాయితితో లేరు.
దీనిని రాజకీయ దురంధుడు కెసిఆర్ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. వన్ షాట్ టు బర్డ్స్ లాగా అటు మోడీ కుట్రను ప్రజల్లోకి సరిగ్గా తిసుకేల్లడం, విశాక ఉక్కుని కొని ఆంధ్రప్రదేశ్లో బిఎస్ఆర్ పునాదులు బలంగా వేయడం. విశాక ఉక్కుని కొంటే చాలు, ఆంధ్రప్రదేశ్ లో కెసిఆర్ అధికారంలోకి రావడం ఖాయం. అందుకే తెలంగాణ సర్కార్ బిడ్లు వేసి విశాక ఉక్కుని ఓడిసిపట్టుకునే పనిలో ఉంది.