ఈరోజు సికింద్రాబాద్ లో జరిగిన సభలో మోడీ ప్రసంగిస్తూ మునుపెన్నడూ లేని విధంగా ఎమ్మెల్సి కవితను టార్గెట్ చేశారు. కెసిఆర్ కుటుంబ పాలనను విమర్శిస్తుంనే కవిత పేరు ఎక్కడా వాడకుండా ఆమెను పరోక్షంగా హెచ్చరించారు.
డిల్లి లిక్కర్ స్కాం ను ప్రస్తావించకుండానే కవిత అందులో పూడుకుపోయింది అనే అర్థం ధ్వనించేలా మాట్లాడారు. కుటుంబ పాలన వల్ల అవినీతి పెరుగుతుంది అని అన్నారు. పెద్దలు చేసే తప్పులే పిల్లలు కూడా చేస్తారు అని అటు కెసిఆర్ ని ఇటు కవితను ఉద్దేశించి అన్నారు.
చట్ట బద్దమైన సంస్థలు తమ విదులు నిర్వహిస్తుంటే వాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు అని ఎద్దేవా చేశారు. వాళ్ళను హెచ్చరిస్తూ, బెదిరిస్తూ ముందుకు సాగిపోవాలని చూస్తున్నారు అని మండిపడ్డారు.
అంటే డిల్లి లిక్కర్ స్కాంలో ఈడి తన విధులు సక్రమంగా నిర్వహిస్తుంటే, కవిత వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళను బెదిరిస్తున్నారు అని పరోక్షంగా నిందించారు.
తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవారైన, ఏ పదవుల్లో ఉన్నా వదిలే ప్రసక్తి లేదని, కవిత అంతు చూస్తాను అని మోడీ పరోక్షంగా ఘాటుగా హెచ్చరించారు.
కవితలాంటి అవినీతి పరులను వదలమంటారా? అని ప్రజలను ప్రశించాగా జనంలో ఒక్కసారిగా చప్పట్ల మోత వినిపించింది.