కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా బుధవారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోగానే ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండానే పోలీసులు ఆయనను దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు. అది కూడా మాములు అరెస్ట్ కాదు – ‘చేతికి బేడీలు వేసి గోరా గోరా ఇడ్చుకు పోతామని’ బెదిరించి కాలర్ పట్టి లాక్కుపోయారు. అయన ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో జరగనున్న కాంగ్రెస్ ప్లీనరీ కోసం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఆయనను ఇంట్లో అరెస్ట్ చేయకుడా, పబ్లిక్ గా ఆయన పరువు తీయాలని పోలీసులు ముందే నిర్ణయించారు. అందుకే ఆయనను వెంటాడుతు విమానాశ్రయానికి చేరుకొని, విమానం ఎక్కి కూర్చోగానే ఒక్కసారిగా సినిమాటిక్ గా అస్సాం పోలీసులు ఆయనను విమానం దించి అరెస్ట్ చేసారు.
ఆ సమయంలో విమానంలో ఉన్న ఇతర కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో దాదాపు 2 గంటల పాటు హైడ్రామా నడిచింది. బోర్డింగ్ పాస్ ఉన్న వ్యక్తిని పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారంటూ నిరసనకు దిగారు. మోడి స్పాన్సర్ చేసిన ఈ కార్యక్రమాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. విమానాల రాకపోకలు ఆగిపోయేలా లాండింగ్ రోడ్డు మీద కూర్చుని అన్ని విమానాలను ఆపేశారు. సాటి ప్రయాణికులు అనేక ఇబ్బందులుపడ్డారు. చివరికి విమానాశ్రయం సిబ్బంది వాళ్ళను పక్కకు లాగి పరిస్తితిని చక్క దిద్దారు.
పవన్ ఖేరాను ఇలా అకారణంగా అరెస్ట్ చేయడం వెనుక చిన్న కారణం లేకపోలేదు. పవన్ ఖేరా ఓ ప్రెస్ మీట్లో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీ గురించి మాట్లాడుతూ ‘నరేంద్ర గౌతమ్ దాస్’ అని మోడి పేరును తప్పుగా పలికారు. వెంటనే తన తప్పు తెలుసుకుని క్షమాపన చెప్పారు. తర్వాత గౌతమ్ అదాని కేసు గురించి, దాని వెనక ఉన్న మోడి హస్తం గురించి మాట్లాడుతూ ‘మోడి పేరేమో దామోదర్ దాస్. కానీ ఆయన చేసే పని మాత్రం గౌతమ్ దాస్ (అదానీని ఉద్దేశిస్తూ) అని సేటారిక్ గా అన్నారు. ఇలాంటి ఆరోపణలు రాజకియలల్లో సర్వసాదారణం.
కానీ మోడీ దీనిని చాలా సీరియస్ గా తీసుకుని, మరో కాంగ్రెస్ నేత అలాంటి వ్యాక్యలు చేయకుండా అరెస్ట్ చేయించి కోర్టులో కేస్ వేశారు. పవన్ ఖేరా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పవన్ ఖేరా పొరపాటున నోరు జారారనీ, అందుకు ఇప్పటికే ఆయన క్షమాపణలు కూడా చెప్పారని గుర్తు చేశారు. దీంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కింది కోర్టు కూడా ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇంత చిన్న విషయాన్ని మోడి అంత సీరియస్ గా తీసుకుని ఆయనను మరోసారి అరెస్ట్ చేయించారు. తిరిగి గురువారం రాత్రి ఆయనను విడుదల చేయాలనీ కోర్ట్ మరోసారి బెయిల్ మంజూరు చేసింది. దీనితో మోడికి మరోసారి భంగపాటు తప్పలేదు.
ఇంత చిన్న సెటైర్ వేసినందుకు మోడి అంత సీరియస్ తీసుకున్నారు. బాగానే ఉంది. అదాని వల్ల దేశఆర్టిక వ్యవస్థ తగలబడి పోతుంటే మోడి ఎందుకు సీరియస్ గా తీసుకోరు అని జనం నిలదిస్తున్నారు. ఈ పౌరుషం అదాని మీద చూపితే దేశం బాగుపడుతుంది కదా అని కన్నెర్ర చేస్తున్నారు.